Vaishnav Tej to debut in a rustic love story వైష్ణవ్ తేజ్ కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెలకమ్..

Mega star for vaishnav tej s debut launch

vaishnav tej, chiranjeevi, allu aravind, allu arjun, ram charan, nagendrababu, mythri movie makers, sukumar, buchibabu, sai dharam tej, movies, entertainment, tollywood

Debutant Vaishnav Tej, member from megastar Chiranjeevis clan, was given a grand welcome at the launch ceremony of his maiden yet-untitled Telugu film

వైష్ణవ్ తేజ్ కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెలకమ్..

Posted: 01/21/2019 06:17 PM IST
Mega star for vaishnav tej s debut launch

మెగా ఫ్యామిలి నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న సందర్బంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు మెగా హీరోలందరూ రామానాయుడు స్టూడియోకు తరలివచ్చారు. ఆ హీరో మరోవరో కాదు.. చిరంజీవి మరో మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.

ఈ చిత్రం ప్రారంభమైన తరువాత మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తొలి సినిమాతోనే మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు తన మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ ఎంతో అదృష్టవంతుడని అన్నారు. ‘నాకు మైత్రి మూవీ మేకర్స్‌లాంటి మంచి నిర్మాణ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆ అవకాశం నా మేనల్లుడికి తొలి చిత్రంతోనే దక్కింది. ఆ విషయంలో వాడెంతో అదృష్టవంతుడు అని అన్నారు. ఈ చిత్ర ప్రీలూక్ చూడగానే తనకు రంగస్థలం గుర్తుకు వచ్చిందన్నారు. ఆ చిత్రం సాధించిన విజయాన్నూ వైష్ణవ్‌ కూడా మంచి హిట్‌ అందుకుంటాడని ఆశిస్తున్నాట్లు తెలిపారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎలా వుంటుందో ముందే ఊహించగలమని అన్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ అంటే సినిమా విభిన్నంగా ఉంటుందని ముందే చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆయన మామూలు సినిమా కథను రాయడానికి వీలుండదని అన్నారు. వైష్ణవ్‌ తేజ్‌కు ఇదే మొదటి సినిమా అనుకుంటున్నారేమో. వాడి మొదటి సినిమా నాది. మొదటి చెక్కూ నేనే ఇచ్చాను. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘జానీ’ చిత్రంలో పవన్‌ చిన్నప్పటి పాత్రలో నటించింది వైష్ణవే’ అని వెల్లడించారు అరవింద్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vaishnav tej  chiranjeevi  allu aravind  mythri movie makers  buchibabu  tollywood  

Other Articles