నరసింహా చిత్రంలో తన నటనకు అవధులు లేవని చాటిన ప్రతినాయిక.. బాహుబలి చిత్రంతో శివగామిగా యావత్ దేశవ్యాప్తంగా తనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రమ్యకృష్ణ. బాహుబలి రెండు భాగాలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రంలో నటించిన పిమ్మట అమె ఎక్కడ కనిపించినా శివగామి అనే పేరుతో జనాలు ఇష్టంగా పిలుచుకుంటున్నారు. బాహుబలిలో తల్లి పాత్ర రమ్యకు అంతగా పాపులరిటీ సంపాదించి పెట్టింది.
ప్రేక్షకుల్లో ప్రత్యేక ఇమేజ్ సాధించి పెట్టిన ఈ గుర్తింపుతో ఆ తరువాత తన వద్దకు వచ్చిన చిత్రాల్లో తన పాత్ర ప్రత్యేకంగా ఉండేలా కథలను ఎంచుకుంటోంది రమ్య కృష్ణ. అయితే ఇప్పుడు ఈ శివగామి పోర్న్ స్టార్ గా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలో శృంగార తారగా కనిపించడానికి రమ్య కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్నీ చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. సమంత, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రంలో రమ్యను తీసుకున్నారు.
లీల అనే పోర్న్ స్టార్ పాత్ర కోసం గత కొంత కాలంగా సెర్చ్ చేస్తోన్న చిత్ర యూనిట్ ఫైనల్ గా రమ్య కృష్ణను సెలెక్ట్ చేసుకుంది. అసలైతే ముందుగా లీలా అనే ఆ పాత్ర కోసం అత్తారింటికి దారేది ఫెమ్ నదియాను సంప్రదించారు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో రమ్యకృష్ణకు పాత్ర గురించి వివరించగా ఆమె పెద్దగా ఆలోచించకుండా దర్శకుడికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శివగామి పోర్న్ స్టారా అనే ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more