F2 - First Week Collections బాక్సాఫీసు కొల్లగొట్టిన సంక్రాంతి తోడల్లుళ్లు.. అంతేగా..

F2 1st week worldwide collections stands all time top 19

F2 Fun and Frustration, F2, f2 movie first week collection, f2 movie collections, f2 collections, Tollywood Box Office share 2019, Venkatesh, Varun Tej, Tamannah, Mehrene Kaur Pirzada, F2 world wide shares, movies, entertainment, tollywood

F2 has an excellent first week with worldwide distributor close to 43 Cr. The first week figures are All time highest for a medium budget film & All Time Top 19th for any film.

బాక్సాఫీసు కొల్లగొట్టిన సంక్రాంతి తోడల్లుళ్లు.. అంతేగా..

Posted: 01/19/2019 04:42 PM IST
F2 1st week worldwide collections stands all time top 19

భారీ బడ్జెట్ చిత్రాలను, బయోపిక్ చిత్రాలను వెనక్కి నెట్టి ఈ సంక్రాంతి బరిలో సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్లీస్టారర్ మూవీ ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సవ్వడి చేస్తోంది. సంక్రాంతి బరిలో విజేతగా నిలిచిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, విడుదలైన తొలిఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వారం రోజుల తరువాత నిర్మాత, డిస్ట్రబ్యూటర్ల పంట పండిస్తుంది.

చక్కటి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారం ప్రపంచవ్యాప్తంగా రూ.42.76 కోట్ల షేర్ రాబట్టింది. ఈ వారాంతానికి రూ.50 కోట్ల షేర్ కిల్లగొట్టనుందని సినీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్2కు చక్కటి ఆదరణ లభించింది. తొలివారం ఏపీ, తెలంగాణల్లో ఈ సినిమా రూ.35 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అమెరికాలోనూ ఈ చిత్రం దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసింది.

ప్రాంతాల వారీగా చూస్తే.. నైజాంలో తొలి వారంలో రూ.11.83 కోట్లు రాబట్టిన ఎఫ్2.. సీడెడ్‌లో రూ.4.7 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో రూ.4.75 కోట్లు, గుంటూరులో రూ.3.14 కోట్లు రాబట్టింది. తూర్పు గోదావరిలో రూ.4.26 కోట్లు, పశ్చిమలో రూ.2.37 కోట్లు.. కృష్ణాలో రూ.3.13 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ మినహా అన్ని ప్రాంతాల బయ్యర్లు ఇప్పటికే లాభాల్లోకి వచ్చేశారు. ఈ వీకెండ్‌ ముగిసేలోగా సీడెడ్ లోనూ బయ్యర్‌ సేఫ్ జోన్లోకి వస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : F2  Box Office share  Venkatesh  Varun Tej  Tamannah  Mehrene Kaur Pirzada  Tollywood  

Other Articles