Kavacham teaser wins hearts ఆసక్తి రేపుతున్న బెల్లంకొండ ‘కవచం’ టీజర్..

Kavacham teaser bellamkonda srinivas wins hearts

KAVACHAM teaser, Bellamkonda Sai Sreenivas, Kajal, Mehreen, Sreenivas Mamilla, Thaman, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

The teaser of Bellamkonda Sreenivas’ upcoming film Kavacham, also starring Kajal Aggarwal and Mehreen Pirzada, was released

ఆసక్తి రేపుతున్న బెల్లంకొండ ‘కవచం’ టీజర్..

Posted: 11/12/2018 09:00 PM IST
Kavacham teaser bellamkonda srinivas wins hearts

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘క‌వ‌చం’. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన శ్రీనివాస్ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ లుక్‌లో శ్రీనివాస్ చాలా బాగున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది.

ఇప్పుడు టీజర్ చూస్తుంటే సినిమాలో శ్రీనివాస్ పోలీస్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ‘కవచం’ టీజర్‌ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. టీజర్‌‌ను యాక్షన్ ప్రోమోలతో నింపేశారు. డైలాగులు కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ‘భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా. వాడే పోలీస్’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్.

‘అనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే. ఆ రాణికి కవచంలా ఒక సైనికుడు’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమా కూడా హీరోయిన్‌కి అండగా నిలిచే హీరో కథతోనే తెరకెక్కినట్లు అర్థమవుతోంది. అయితే ఆ రాణి కాజల్ అగర్వాలా లేక మెహ్రీనా అనేది సినిమా చూస్తే కానీ తెలీదు. ‘పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉండాలి’ అనే డైలాగుతో టీజర్ ముగిసింది. మొత్తంగా చూసుకుంటే ఈ టీజర్ యాక్షన్ ప్యాక్.

ఈ చిత్రంలో హ‌ర్షవ‌ర్ధన్ రాణే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ కీల‌క‌పాత్రల్లో న‌టించారు. పోసాని కృష్ణముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే ‘క‌వ‌చం’ షూటింగ్ పూర్తయింది. కేవ‌లం పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్రమే మిగిలి ఉంది. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KAVACHAM teaser  Bellamkonda Sai Sreenivas  Kajal  Mehreen  Sreenivas Mamilla  Thaman  tollywood  

Other Articles

  • I am glad that god has chosen me for this work sonu sood

    మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

    Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

  • Priyamani is comrade bharathakka in virata parvam

    విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

    Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

  • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

    నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

    Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

  • Samantha strong reply to haters goes viral on social media

    విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

    May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

  • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

    ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

    May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh