విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తోన్న మల్టీస్టారర్ ‘ఎఫ్2’. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అన్న ట్యాగ్ లైన్‌తో వస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ కు జంటగా మెహరీన్ నటిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ‘ఎఫ్2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రావిపూడి.. ఈ చిత్రాన్ని సక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఇదిలా ఉంటే, దీపావళి పండుగను పురష్కరించుకుని ‘ఎఫ్2’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా సింపుల్ గా ఉంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ మోడరన్ లుక్ లో ఉన్న సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. అంతేకాకుండా ‘వస్తున్నారు సంక్రాంతి అల్లుళ్లు’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై రాశారు.
ఫస్ట్‌లుక్ విడుదల సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్లో వస్తోన్న మంచి వినోదభరిత చిత్రం ‘ఎఫ్2’. మెసేజ్‌తో పాటు అన్ని కమర్షియల్ హంగులను దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. మూడు వరుస హిట్స్ తర్వాత అనిల్ చేస్తోన్న చిత్రమిది. ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. క్లైమాక్స్, మూడు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more