హీరో ఆకాష్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తన తనయుడు ఆకాశ్ పూరీని హీరోగా పెట్టి 'మెహబూబా' చిత్రానికి దర్శక, నిర్మాణ పనులు చేసినా.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద సందడి చేయలేదు. దీంతో అర్థిక బారంతో సతమతం అయిన పూరీ.. కొంత గ్యాప్ తీసుకున్నా తరువాత తన తనయుడికి మంచి బ్రేక్ ఇవ్వాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడని చిత్రపురి వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
అయితే మెహబూబా చిత్రంలో అకాష్ కు మత్రం నటన పరంగా మంచి మార్కులు తెచ్చిపెట్టింది గానీ, లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఈ సినిమా కారణంగా పూరి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడ్డాడనే వార్తలు షికారు చేశాయి. మళ్లీ ఆకాశ్ తో సినిమా వుంటుందో లేదోనని అనుకున్నారు. కానీ ఆకాశ్ హీరోగా ఒక సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం.
పూరి ఆఫీసులో ఒక కథపై ఒక రేంజ్ లో కసరత్తు జరుగుతోందట. ఈ కథను ఆకాశ్ కోసమే సిద్ధం చేస్తున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ సినిమాకి పూరి దర్శకత్వం వహించడం లేదట. ఒక కొత్త కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమా పూరి సొంత బ్యానర్లో రూపొందుతుందా? లేదంటే మరో నిర్మాత నిర్మిస్తున్నారా? అనే విషయంలోనే క్లారిటీ రావలసి వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more