Ram Charan fans awaiting for his next first look రాంచరణ్ అభిమానుల్లో పెరుగుతున్న అసక్తి..

Ram charan fans awaiting for his next first look

Ram Charan, Sukumar, Boyapati srinivas, vinaya vidheya rama, first look, rangasthalam, movies, entertainment, tollywood

Currently Ram Charan is working with Boyapati Srinu for his next upcoming film RC12, in which Kiara Advani is playing the female lead and Vivek Oberoi is essaying antagonist.

రాంచరణ్ అభిమానుల్లో పెరుగుతున్న అసక్తి..

Posted: 10/20/2018 07:18 PM IST
Ram charan fans awaiting for his next first look

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన రంగస్థలం చిత్రం తరువాత అంతకుమించిన అంచనాలతో వస్తున్న తాజా చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇది పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో కూడా చరణ్ నటనపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు 3 నెలలు అవుతోంది. చిత్రం కూడా మరికొన్ని రోజుల వ్యవధిలో పూర్తికావస్తుందని కూడా సమాచారం.

అయినా ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకూ చరణ్ ఫస్టులుక్ ను మీడియాకు విడుదల చేయలేదు చిత్రవర్గాలు. సినిమా షూటింగ్ రమారమి పూర్తి కావస్తున్నా ఇంకా ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంపై మెగా అభిమానులు నిరాశకి గురవుతున్నారు. ఇంతవరకూ బోయపాటి ఈ సినిమా ఫస్టులుక్ ను వదలకపోవడానికి కారణం ఏమిటనే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే టైటిల్ లోగోను ఖరారు చేయకపోవడమే అందుకు కారణమని తాజాగా తెలుస్తోంది.

ఈ సినిమాకి ఇటీవలే 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ను ఎంపిక చేశారు. అయితే, ఈ  టైటిల్ లోగోను దర్శక నిర్మాతలు, చరణ్ ఖరారు చేయవలసి వుంది. రకరకాలుగా టైటిల్ లోగోను డిజైన్ చేయిస్తున్నారు. ఇంతవరకూ ఏ డిజైన్ కూడా సంతృప్తికరంగా అనిపించకపోవడం వల్లనే ఫస్టులుక్ బయటికి రాలేదని చెబుతున్నారు. టైటిల్ లోగో ఓకే అయిన వెంటనే ఫస్టులుక్ ను వదిలేస్తారట. బహుశా దీపావళికి రావొచ్చని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram chran  Boyapati  vinaya vidheya rama  first look  rangasthalam  tollywood  

Other Articles

 • Siima 2019 awards rangasthalam keerthy suresh kgf win big

  'సైమా' అవార్డులు: రంగస్థలం, మహానటి చిత్రాలకు అవార్డుల పంట..

  Aug 16 | దుబాయ్ లో అత్యంత వైభవంగా జరిగిన సైమా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రామ్ చరణ్, సమంత జంటగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' దుమ్మురేపింది. మొత్తం 9 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. రామ్ చరణ్,... Read more

 • Allu arjun trivikram film titled ala vaikuntapuramlo

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.!

  Aug 16 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం గురించి అభిమానులకు తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.... Read more

 • Sye raa making video chiranjeevi film has grandeur written all over it

  మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చిన కొణిదెల ప్రోడక్షన్స్.!

  Aug 14 | స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డీ రూపోందిస్తున్న చారిత్రాత్మక చిత్రం. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 152వ చిత్రంగా రూపోందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మెగా... Read more

 • Rajinikanth akshay kumar film 2 0 gets a new release date in china

  చైనాలో రజనీకాంత్ ‘రోబో 2.0’ ప్రభంజనం

  Aug 14 | తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.ఓ సినిమాను ఆయన అభిమానులను రుచించలేదనే చెప్పాలి. ఈ చిత్రం విడుదలకాగానే డివైడ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ పొందడానికి... Read more

 • Akshay kumar zeitgeist while phone rings during media meet

  మీడియా మీట్ లో ఫోన్ మోగితే.. అక్షయ్ ఆన్ లైన్..

  Aug 14 | బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ కు సమయస్ఫూర్తి ఎక్కువని.. దాంతో పాటుగా హాస్య చతురత కూడా అదికమన్న విషయం తెలిసిందే. ఇలాంటి హాస్యానికి వెళ్లిన ఆయన తన సహచరి సోనాక్షి చేతిలో పరాభవానికి కూడా... Read more

Today on Telugu Wishesh