Raghavendra Rao praises Sukumar and Ram Charan సుకుమార్, రాంచరణ్ లకు అగ్రదర్శకుడి ప్రశంసలు

Raghavendra rao praises sukumar and ram charan

Rangasthalam, Ram Charan, Sukumar, Raghavendra rao, Raghavendra Rao sukumar, Raghavendra Rao Ram Charan, Sukumar, Ram Charan village drama, devisri prasad, movies, entertainment, tollywood

Tollywood Renowned director Raghavendra Rao praises director sukumar and mega power stat Ram Charan for their Rangasthalam.

సుకుమార్, రాంచరణ్ లకు అగ్రదర్శకుడి ప్రశంసలు

Posted: 10/08/2018 07:55 PM IST
Raghavendra rao praises sukumar and ram charan

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను నెలకొల్పి ముందుకు దూసుకెళ్లిందన్న విషయం అందరీకీ తెలిసిందే. ఏకంగా రెండు వందల కోట్లకు పైగా ఆదాయాన్ని రాబట్టిన చిత్రంగానూ ఈ సినిమా నిలిచింది. అంతేకాదు ఏకంగా వందరోజుల పండుగను కూడా చేసుకున్న ఈ సినిమాపై తాజాగా అగ్రదర్శకుడు కే. రాఘవేంద్రరావు ప్రశంసలు కురిపించారు.  ఓ కార్యక్రమంలో ఆయన తన మనస్సులోని బావాలను పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన ముచ్చట్లను పంచుకున్నారు. ఇదే సమయంలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. "తమిళ .. బెంగాలీ .. హిందీ భాషా చిత్రాల్లో జరుగుతోన్న ప్రయోగాలు తెలుగులో జరగడం లేదు. తెలుగు దర్శకులు ప్రయోగాలు చేయడానికి ముందుకు రావడం లేదనే విమర్శ కూడా వుంది .. ఈ విషయంపై మీరు ఏమంటారు?" అనే ప్రశ్న రాఘవేంద్రరావుకు ఎదురైంది.

అప్పుడు ఆయన స్పందిస్తూ .. "కొంతకాలం క్రితం వరకూ ఈ విమర్శ నిజమేనని అనుకోవచ్చు. కానీ ఇప్పుడొస్తోన్న యువ దర్శకులు చాలామంది కొత్తగా ఆలోచిస్తున్నారు .. డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ వెళుతున్నారు. చరణ్ లాంటి హీరోను చెవిటివాడిగా చూపించాలంటే మేమంతా భయపడేవాళ్లం. కానీ సుకుమార్ అద్భుతంగా ఆ పాయింట్ ను హ్యాండిల్ చేశాడు. ఇక ఇమేజ్ ను పక్కన పెట్టేసి హీరోలు ముందుకురావడం కూడా మంచి పరిణామం" అని చెప్పుకొచ్చారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Ram Charan  Sukumar  Raghavendra rao  Experiments  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh