megastar names fans daughter మెగాస్టార్ అభిమాని కోరిక ఫలించింది.. ఆరుషి..

Megastar fan feels happy as his dream come true

megastar, chiranjeevi, chiranjeevi fans, telugu states, mandapeta, east godavari, aurushi, kontham prasad, invitation, movies, entertainment, tollywood

Megastar Chiranjeevi, who has plenty of fans in telugu states, has fullfilled one of his fan dream by naming his daughter, who also born on the same day (august 22).

మెగాస్టార్ అభిమాని కోరిక ఫలించింది.. ఆరుషి..

Posted: 08/25/2018 04:56 PM IST
Megastar fan feels happy as his dream come true

చిరంజీవికి ఎంతోమంది అభిమానులు వున్నారు. వాళ్లంతా కూడా చిరంజీవి పట్ల గల ఆరాధనా భావంతో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాంటి అభిమానులలో శ్రీ కొంతం ప్రసాద్ గారు ఒకరు. తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామానికి చెందిన ఆయన, చిరంజీవి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 22 .. 2017లో ఆయనకి రెండవ సంతానంగా ఒక పాప జన్మించింది. చిరంజీవి పుట్టినరోజునాడే తనకి పాప పుట్టడం వలన, ఆయనతోనే ఆ పాపకి నామకరణం చేయించాలని ప్రసాద్ భావించాడు. అప్పటి నుంచి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ఆయనకి, తాజాగా మెగాస్టార్ నుంచి ఆహ్వానం అందింది.

దాంతో ప్రసాద్ తన భార్య బిడ్డలతో చిరంజీవిని కలుసుకున్నాడు. చిరంజీవి ఆ పాపకి 'ఆరుషి' అని నామకరణం చేసి .. ఆశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చేతుల మీదుగా తమ పాపకి నామకరణం జరగడం పట్ల ప్రసాద్ దంపతులు ఆనందంతో పొంగిపోతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  fan  mandapeta  east godavari  aurushi  kontham prasad  andhra pradesh  tollywood  

Other Articles