మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఆయన తాజా చిత్రం, స్వాతంత్ర్య సమరయోధుడు, స్వాతంత్రం కోసం అంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్రలోని పలు కీలక పుటలను తీసుకుని ఆయన గోప్పదనాన్ని తెలుగు ప్రేక్షకులకు తెలియజేసే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి నుంచి తొలి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
'సైరా' సినిమా నుంచి ఫస్టు టీజర్ విడుదల కావడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ఏకంగా టీజర్ ను చూసి ఇక చిత్రం బాహుబలి రికార్డులను తిరగరాయడం ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి 151 చిత్రం సైరాపై అభిమానుల్లో నెలకోన్న అంచనాలను టీజర్ ఏకంగా ఎన్నో రెట్లు పెంచింది. 'సైరా' విడుదలకి చాలా సమయం ఉన్నప్పటికీ, మెగా అభిమానులను ఉత్సాహ పరచాలనే ఉద్దేశంతోనే చిత్ర నిర్మాణవర్గం ఈ టీజర్ ను వదిలారు. ఈ టీజర్ ను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 12 మిలియన్ల డిజిటల్ వ్యూస్ లభించాయి. దీనిని బట్టి ఈ సినిమాపై ఏ స్థాయిలో అందరిలో ఆసక్తి వుందో అర్థమవుతోంది.
'సైరా' నుంచి వచ్చిన ఫస్టు టీజర్ కి అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ టీజర్ సూపర్బ్ గా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ టీజర్ అభిమానుల అంచనాలను అందుకునేలా .. వాళ్లకు సంతృప్తిని కలిగించేలా వుందని చెబుతున్నారు. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో 'బాహుబలి' స్థాయి కథాకథనాలతో.. భారీ తారాగణంతో .. సాంకేతిక విలువలతో ఈ సినిమా రానుందనే ఆసక్తితో అందరూ వున్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more