Smart And Timely Gesture From RX100 Hero వదులు కోకూడదు అనుకున్నా. కానీ వారి కోసం..

Rx 100 movie hero kartikeya offers bike for auction

rx100, karthikeya, Kerala Floods, auction, payal rajput, producer, relief donation, casting couch, movies, entertainment, tollywood

he lead actor Kartikeya has announced the RX100 bike used in the movie will be auctioned and the amount it gets would be donated to the Kerala Floods Relief. It is smart because the bike has a huge craze now.

వదులు కోకూడదు అనుకున్నా. కానీ వారి కోసం..

Posted: 08/20/2018 09:05 PM IST
Rx 100 movie hero kartikeya offers bike for auction

కేరళ రాష్ట్ర ప్రజలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతుగా సహాయం అందించేందుకు ముందుకు వస్తున్న క్రమంలో టాలీవుడ్ లో ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘RX 100’ చిత్ర బృందం కూడా ముందుకొచ్చింది. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్‌ కథానాయిక. అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అశోక్‌ రెడ్డి నిర్మాత. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రంలో కథానాయకుడు, కథానాయిక కలిసి యమహా RX 100 బైక్‌పై తిరుగుతారు. అయితే ఇప్పుడు కేరళ వరద బాధితుల కోసం ఈ బైక్‌ను వేలానికి ఉంచుతున్నట్లు కార్తికేయ ప్రకటించారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తామని తెలిపారు. వేలం రూ. 50 వేల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. వివరాలను This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.కు పంపాలని కోరారు.

‘కేరళలో జరుగుతున్న పరిణామాల గురించి మనకు తెలుసు. మనలా సంతోషంగా ఉండే చాలా కుటుంబాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. తోటి రాష్ట్రంగా వారికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత మనది. ‘RX 100’ చిత్ర బృందం తరఫున బైక్ ను వేలానికి ఉంచి, వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలి అనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే.. నాకు జీవితంలో చాలా ముఖ్యమైన వస్తువు ఆ బైక్‌. జీవితంలో ఎప్పుడూ వదులు కోకూడదు అనుకున్నా. కానీ వారికి జరిగిన నష్టం ముందు ఇది చాలా చిన్న విషయం. మా సినిమాను మీరు ఎంతో ఆదరించారు. అంతకు మించి మీరు మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది’ అని కార్తికేయ చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rx100  karthikeya  Kerala Floods  auction  payal rajput  producer  relief donation  tollywood  

Other Articles