rakul preet to play a key role in ntr biopic అన్నగారి బయోపిక్ లో అందమైన హీరోయిన్..?

Rakul preet to play a key role in ntr biopic

Rakul Preet Singh, ntr biopic, Nandamuri Balakrishna, vidyabalan, Krish Jagarlamudi,tollywood, movies, entertainment

If sources are to be belived there is a news doing rounds in filmnagar that a leading south indian actress rakul preet singh to play a key role in ntr biopic

అన్నగారి బయోపిక్ లో అందమైన హీరోయిన్..?

Posted: 07/11/2018 06:38 PM IST
Rakul preet to play a key role in ntr biopic

నందమూరి అభిమానుల దృష్టి మొత్తం 'ఎన్టీఆర్' బయోపిక్ పైనే వుంది. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా .. బసవతారకం పాత్రను విద్యాబాలన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారన్న టాక్ అంచనాలను పెంచుతుంది.

తాజాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌.. ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ఒక ప్రత్యేకమైన పాట కోసం దర్శకుడు క్రిష్ .. రకుల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ .. హిందీ సినిమాలతో రకుల్ బిజీగా వుంది. అయినా ఈ ప్రాజెక్టుకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ ప్రత్యేకమైన పాటలో మెరవడానికి అంగీకరించిందని అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అనేకం హిట్ అయిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ తన సుదీర్ఘ చలనచిత్ర చరిత్రలో ఓ అప్పారవు ఓ సుబ్బారావు పాట దగ్గర్నించి.. అనేక ఐటమ్ పాటలలో జయమాలిని, అనురాధ, జ్యోతిలక్ష్మీలతో అట అడుతూ, పాడుతూ వుంటే ఇప్పటికే 70 ఏళ్లు దాటిన అప్పటి యువత.. ఇప్పటికీ ఈలలు వేస్తూ గోల చేయడం గ్యారంటీ. అయితే ఏ పాటని రకుల్‌ప్రీత్ సింగ్ కోసం ఈ సినిమాలో కేటాయించారో చిత్రం విడుదల వరకూ సస్పెన్స్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. స్టార్స్‌‌ చేరికతో ఎన్టీఆర్‌ సినిమా‌పై అంచనాలు పెరిగిపోతుండగా.. చిత్ర యూనిట్ ఆశించిన దానికంటే ఎక్కువగానే ప్రచారం లభిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  ntr biopic  Nandamuri Balakrishna  vidyabalan  Krish Jagarlamudi  tollywood  

Other Articles