Ram Charan suggests Boyapati on budget బోయపాటికి రాంచరణ్ సూచన.. దానయ్య ఖుష్..

Ram charan suggests boyapati on budget in ongoing project

Rangasthalam, Ram Charan, Sukumar, boyapati srinu, dvv danayya, movies, entertainment, tollywood

After Ram Charan’s latest outing Rangasthalam has struck the jackpot at the box office, his next with boyapati ongoing project mega power star suggested mega director to keep a check on budget of the movie.

బోయపాటికి రాంచరణ్ సూచన.. దానయ్య ఖుష్..

Posted: 07/11/2018 07:13 PM IST
Ram charan suggests boyapati on budget in ongoing project

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం రికార్డులను బద్దలుకొట్టి.. కొత్త రికార్డులను సృష్టించిన నేపథ్యంల అతని మార్కెట్ విసృత్తంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రం భారీ బడ్జెట్ తో కూడుకోవడంతో.. రాంచరణ్.. ఈ తరహా ఖర్చులు తగ్గించుకోవాలని దర్శకుడికి సూచించాడని టాక్. బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి డీవీవీ దానయ్య నిర్మాత.

'రంగస్థలం' లాంటి భారీ హిట్ చిత్రం తరువాత చేస్తున్న ఈ సినిమా కథాకథనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చరణ్.. బడ్జెట్ విషయంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాడని అంటున్నారు. బోయపాటి సినిమాలు సహజంగానే భారీ బడ్జెట్ తో కూడుకున్నవి వుంటాయన్ని టాక్ వుంది. భారీగా తన చిత్రాలను నిర్మించే బోయపాటి.. తన చిత్రాల రూపోందించేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయిస్తుంటాడు. ప్రస్తుతం చేస్తోన్న సినిమా విషయంలోను ఆయన అదే పద్ధతిని కొనసాగిస్తున్నాడు.

ఈ సినిమాలో విలన్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే ఆయన భారీ మొత్తమే ఖర్చు చేయించాడట. ఖర్చు పెరిగిపోతూ వుండటాన్ని గమనించిన చరణ్, ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే 10 కోట్ల తక్కువకే చిత్రీకరణ పూర్తి చేయాలని బోయపాటికి చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది. మార్కెట్ వుంది కదా అని ఖర్చు చేయించవద్దనీ .. నిర్మాతకి లాభాలు రావాలని చెప్పడమే కాకుండా, ఎప్పటికప్పుడు ఖర్చు గురించిన వివరాలు తెలుసుకుంటూ నియంత్రణ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Ram Charan  Sukumar  boyapati srinu  dvv danayya  movies  entertainment  tollywood  

Other Articles

  • Mahesh babu s sarileru neekevvaru release date confirmed

    మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

    Oct 12 | అలా.. అలవైకుంఠపురములో మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారో లేదో ఇలా సంక్రాంతి బరిలో కాస్కో అంటూ వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రిలీజ్ డేట్‌ను... Read more

  • Sye raa box office day 8 collection chiru s film mints rs 90 crore in telugu states

    తెలుగునాట రూ.90 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’

    Oct 10 | మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా.. ఆయన నటించిన తొలి చారిత్రక చిత్రం తెలుగు రాష్ట్రాలలో సందడి చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం ప్రేక్షకుల ముందుకు... Read more

  • Telangana governor tamilisai soundararajan praises this sye raa

    మెగాస్టార్ ‘సైరా’ను ప్రశంసించిన గవర్నర్ తమిళ సై..

    Oct 10 | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటనను అబాలగోపాలం కీర్తిస్తున్నారంటే.. ఆయన ఎంతగా ఈ చిత్రం కోసం... Read more

  • Gaddalakonda ganesh rs 21 crore share in two weeks

    గద్దలకొండ గణేష్ రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..

    Oct 07 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్.. మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం విడుదలైనా తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం... Read more

  • Sye raa box office day 4 collection chiru s film mints rs 123 crore worldwide

    రూ.100 కోట్ల క్లబ్ లోకి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’

    Oct 05 | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. చిరంజీవి నటశిఖరమని చలనచిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు, దర్శకులు కొనియాడుతున్నారు. మెగాస్టార్ నటవిశ్వరూపాన్ని ఈ... Read more

Today on Telugu Wishesh