kalyan ram announces next movie with NTR ఎన్టీఆర్ తో మరో మూవీకి కల్యాణ్ రామ్ రెడీ..!

Kalyan ram announces next movie with ntr

naa nuvve, Nandamuri Kalyan Ram, NTR, Tarak, producer, next movie, ntr kalyan ram, tarak kalyan ram, kalyan ram produce, kalyan ram tarak, kalyan ram ntr, movies, entertainment, tollywood

Ahead of the release of 'Naa Nuvve' on June 14, Nandamuri Kalyan Ram announces next movie with NTR after ss rajamouli's project

ఎన్టీఆర్ తో మరో మూవీకి కల్యాణ్ రామ్ రెడీ..!

Posted: 06/13/2018 08:29 PM IST
Kalyan ram announces next movie with ntr

కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా కొంతకాలం క్రితం చేసిన 'జై లవ కుశ ' భారీ విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోయిన ఈ సినిమా, కల్యాణ్ రామ్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో మళ్లీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నట్టు తాజాగా కల్యాణ్ రామ్ చెప్పాడు."ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నేను హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాం. ఆ తరువాత సినిమా ఎన్టీఆర్ తో ఉంటుంది" అని కల్యాణ్ రామ్ అన్నాడు.

అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. అందువలన కల్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naa nuvve  Nandamuri Kalyan Ram  NTR  Tarak  producer  next movie  tollywood  

Other Articles