మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కి సంబంధించి మరో తాజా అప్ డేట్ లభించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం రూపోందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ గ్రెగ్ పావెల్ ను ఎంపిక చేశారన్న టాక్ ఇప్పుడు చిత్రపురి వీధుల్లో చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారన్న వార్తలతోనే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డీ హాలివుడ్ రేంజ్ లో రూపోందిస్తున్నారని టాక్. అందుకే యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ గ్రెగ్ పావెల్‌ను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. నగరంలోని వేసిన సెట్లో తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశాలను ఆయన పర్యవేక్షిస్తున్నారట. గ్రెగ్ పావెల్‌తో కలసి దర్శకుడు సురేందర్ రెడ్డి తీసుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఇద్దరూ నోట్లో సిగార్ పెట్టుకుని చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. ‘సైరా’పై సురేందర్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఈ సినిమాకు పనిచేస్తుండటంతో ‘సైరా’పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన గ్రెగ్ పావెల్ గతంలో జేమ్స్‌బాండ్ మూవీ ‘స్కైఫాల్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6’, ‘హ్యారీ పోటర్’ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ‘హాలీడే’, సల్మాన్ ఖాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రాలకు కూడా గ్రెగ్ పనిచేశారు. ఇక ఈ చిత్రంలో భాగస్వాములైన జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, ప్రగ్యా జైశ్వాల్, బ్రహ్మాజీ అదనపు అకర్షణగా నిలవునున్నారు. రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సైరా’. వచ్చే ఏడాది విడుదల చేయడమే లక్ష్యంగా షూటింగ్ జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more