Bharat Play Key Role In Allu Sirish ABCD అల్లు శిరీష్ తాజా చిత్రంలో ఈ నలుడెవరో తెలుసా.?

Child artist bharat play key role in allu sirish new movie

Child Artist Bharat Play Key Role In Allu Sirish New Movie, Bharat, Allu sirish, ABCD, child artist, priyamani, full length role,Allu Sirish tweets, Master Bharat, Master Bharat Latest Pics, Master Bharat Transition As Young Hero, Latest Gossips, Celebrity Updates, Tollywood Updates, Priyamani tweets, Allu Sirish New movie, allu sirish movies, Bharat Comedy Scenes, Bharat Latest Updates, tollywood, movies, entertainment

Master Bharat Had Appeared in Many Movies As Child Artist And Now he Signed A movie that Is With Allu Sirish And He Play Key Role In Sirish movie .

అల్లు శిరీష్ తాజా చిత్రంలో ఈ నలుడెవరో తెలుసా.?

Posted: 06/11/2018 06:31 PM IST
Child artist bharat play key role in allu sirish new movie

విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ పంచతంత్రం చిత్రం నుంచి బాలనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించి.. ఇప్పటికీ దక్షిణాది ప్రేక్షకుల హార్టులో హోలు పెట్టిన నటుడిగా గుర్తింపును తెచ్చుకున్న నటుడు ఎవరో తెలుసా.? బాల నటుడిగా అభినయించి.. చిన్న వ‌య‌సులోనే ఎన్నో తెలుగు సినిమాల్లో అత్యద్భుతంగా న‌టించి పేరు తెచ్చుకున్న బాల న‌టుడతను. ఎవరో అర్థమైందా..? ఆ బాలనటుడే భరత్. మంచు విష్ణు దూసుకెళ్తా చిత్రంలో కొంత వరకు ఎదిగినట్లు కనిపించాడు. ఓ ముస్లిం అమ్మాయితో నడిపే ప్రేమ కూడా బాగా అకట్టుకుంటుంది.

అయితే ఇప్పుడు మాత్రం భ‌ర‌త్ పూర్తిగా మారిపోయాడు. అసలు గుర్తుపట్టరానంతగా మారిపోయాడు‌. నూనుగు మీసాల నూత్న యవ్వనమున అన్నట్లుగా ఎదిగిపోయాడు. బాల నటుడిగా `వెంకీ`, `పోకిరి`, `ఢీ`, `రెడీ`, `దుబాయ్ శీను`, `ర‌గ‌డ‌`, `కింగ్‌`, `న‌మో వెంక‌టేశ` వంటి సినిమాల్లోఎంతో మందిని ఆక‌ట్టుకున్న భరత్ నటన.. ఇక ఇప్పుడు మరింతగా దూసుకుపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకిలా అంటే.. తాజాగా అల్లు శిరీష్ చేసిన ఓ ట్వీట్ దీనికి కారణం. తన తాజా చిత్రం ఏబిసిడీలో భరత్ తనతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడని ట్వీట్ చేశాడు.
 
ఇప్పటి వరకు చైల్డ్ అర్టిస్టుగా రాణించిన భరత్ ఇక తన చిత్రంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మార‌బోతున్నాడు. వెల్‌క‌మ్ భ‌ర‌త్‌. ఇప్పుడు ఇత‌ణ్ని చూస్తే ఎవ్వ‌రూ గుర్త‌ప‌ట్ట‌లేరు. కానీ, శ్రీ చిలిపి వెన్నెల కిషోర్ గుర్తుపట్టాడు. కాకా కో ప్ర‌ణామ్‌` అంటూ ట్వీట్ చేశాడు. భ‌ర‌త్ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటో చూసి హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఆశ్చ‌ర్య‌పోయింది. `ఓ మైగాడ్‌.. ఎంత ఎదిగిపోయాడు. `ర‌గ‌డ` సినిమాలో అతనితో క‌లిసి న‌టించాను. ఎంతో ఎంజాయ్ చేశాను. భ‌ర‌త్‌కు హాయ్ చెప్పు` అంటూ ప్రియ‌మ‌ణి ట్వీట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat  Allu sirish  ABCD  child artist  priyamani  full length role  tollywood  movies  entertainment  

Other Articles