Tollywood director Rajasimha reveals what happened ముంబై హోటళ్లో అలా వున్నది అందుకే

Tollywood director rajasimha reveals what actually happened

director rajasimha, suicide attempt, writer rajasimha suicide attempt, rajasimha, suicide attempt, director, Sandeep Kishan, Rudramadevi, Oka Ammayi Tappa, writer, tollywood, movies, entertainment

Telugu writer, director Rajasimha Tadinada, who directed Sandeep Kishan’s Oka Ammayi Tappa, says his sugar levels rose high and he fall unconsious in mumbai hotel, but felt sas when he saw news claiming to attempt suicide.

ముంబై హోటళ్లో అలా పడివున్నది అందుకే..

Posted: 05/18/2018 04:44 PM IST
Tollywood director rajasimha reveals what actually happened

“ ఆయనది అందమైన లోకమే.. కోటి అశలతో సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. ఎన్నో చిత్రాలకు రచయితగా వ్యవహరించి.. అనుష్క ప్రధానపాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'రుద్రమదేవి' చిత్రానికి మాటలు రాసి.. తనకు గుర్తింపుకు కూడా తెచ్చుకున్నారు. అయనే రచయిత, దర్శకుడు రాజసింహ. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంతో దర్శకుడిగానూ తానేంటో నిరూపించుకున్న రాజసింహ తాజాగా ఆయన విహారయాత్రలో భాగంగా ముంబైకి వెళ్లాడు.

అక్కడ హోటల్ లోని సోఫాలో అయన అపస్మారక స్థితిలో పడి వుండటాన్ని చూసిన పలువరు ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆయన అనుకున్నంత గుర్తింపు రానందునే ఆయన అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్న వార్తలు సినీవర్గాలను కలవరపర్చాయి. అయితే చికిత్స తరువాత కోలుకున్న ఆయన పత్రికలను చూసి కలత చెందాడు. తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడటం ఏంటని తనను తాను ప్రశ్నించుకున్నాడు.

అయితే ఈ విషయంలో నిజం లేదని, జరిగింది ఒకటైతే.. మీడయాలో వచ్చింది మరొకటని డైరెక్టర్ రాజసింహా అన్నారు. ఇదే విషయంపై ఆయన సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. తనకు షుగర్ వ్యాధి ఉంది. నిన్న ముంబైలో ఉండగా షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో స్పృహ తప్పి పడిపోయానని చెప్పారు. తన పక్కన ఎవరూ లేకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని చెప్పారు. తర్వాత అంతా హడావిడి అయిపోయింది. ఎవరో తనను అసుపత్రికి తీసుకెళ్లారని.. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడిందని.. తన ఆరోగ్యం గురించి కంగారు పడిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajasimha  suicide attempt  director  Sandeep Kishan  Rudramadevi  Oka Ammayi Tappa  writer  tollywood  

Other Articles