Srinivasa Kalyanam changes release date నితిన్ 'శ్రీనివాస కల్యాణం' రిలీజ్ డేట్ ఫిక్స్..

Nithiin s srinivasa kalyanam postponed to august

Srinivasa Kalyanam, Raashi Khanna, Prakash Raj, Nithiin, Dil Raju, Sateesh Vignesya, tollywood, movies, entertainment

‘Srinivasa Kalyanam’ has been creating a lot of buzz in Tollywood ever since it went on floors. Directed by Sateesh Vignesya of ‘Shatamanam Bhavathi’ fame, the film is touted to be a romantic entertainer.

నితిన్ 'శ్రీనివాస కల్యాణం' రిలీజ్ డేట్ ఫిక్స్..

Posted: 05/17/2018 07:47 PM IST
Nithiin s srinivasa kalyanam postponed to august

దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. నితిన్ జోడిగా రాశి ఖన్నా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కొనసాగనున్న ఈ కథను, అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

 ముందుగా ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడం వలన, ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఆగస్టు 9వ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారనేది తాజా సమాచారం. దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్లో గతంలో వచ్చిన 'శతమానం భవతి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను అంచనాలు వున్నాయి. ఇక 'తొలిప్రేమ' హిట్ తరువాత రాశి ఖన్నా నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh