Dallas Meet: Chiru old video goes viral నెట్టింట్లో చిరంజీవి పాత వీడియో వైరల్..!

Megastar chiranjeevi s dallas meet old video goes viral

Chiranjeevi, Mega Star, Chiru Fans Association, dallas, north america, trending news, movies, tollywood, entertainment

Megastar Chiranjeevi recently went to America, where he was busy in his shedule. Now an old video of chiru is doing rounds in social media which belongs to 2013.

నెట్టింట్లో చిరంజీవి పాత వీడియో వైరల్..!

Posted: 04/30/2018 06:58 PM IST
Megastar chiranjeevi s dallas meet old video goes viral

సెలబ్రిటీలు ఏం చేసినా అది వారికి అదనపు అకర్షణే అవుతుంది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే అ ట్రెండే వేరప్ప. చిరంజీవి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ వేడుకల నిమిత్తం ఆయన డల్లాస్ కు వెళ్లారు. అయితే అక్కడ చిరంజీవి అక్కడ భావోద్వేగంతో ఆనంధబాష్పాలు రాల్చారని సోషల్ మీడియాల్లో, వివిధ న్యూస్ చానళ్లలో వైరల్ అవుతూ అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది.

"మనసాంతరాల్లోంచి మాట్లాడతానని ఇక్కడ నిలబడే వరకు తెలియదు. మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ఈ మధ్య నా మనసుని తాకిన ఆప్యాయత, ఆత్మీయ సమావేశం ఏదైనా ఉందంటే ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ సమావేశమే. సమయం దాటి పోయింది, అందరూ ఆకలితో ఉన్నారని, కొద్దిగానే మాట్లాడి త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోదామనుకున్నాను. తానా వారి ఆహ్వానంతో అమెరికాకు వచ్చాను. ఇక్కడి కొంతమంది అభిమానులు నన్ను కలవాలని అనుకుంటున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

దీంతో వచ్చాను.. ఇక్కడ ఖానా పేరుతో ఓ అసోసియేషన్‌ ఉందని కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. మీరు గుర్తింపు కోసం కాదు.. సంతృప్తి కోసం సేవ చేస్తున్నారు. నిశబ్ద సైనికులలా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేను మీకు స్ఫూర్తి అన్నారు.. చెప్పాలంటే, మీరే నాకు స్ఫూర్తి" అని చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు. అయితే ఈ వీడియో ఐదేళ్ల క్రితందని ప్రవాసాంధ్రులు వివరణ ఇచ్చారు.

2013లో ఆయన డల్లాస్ కు వచ్చినప్పుడు తీసిన వీడియోను ఇప్పుడు తిరిగి అప్ లోడ్ చేస్తూ, అది తాజా వీడియో అని చెబుతున్నారని, కొందరు కావాలనే ఆ వీడియోకు కులాలను రెచ్చగొట్టేలా కామెంట్లు పెట్టి పోస్టులు పెడుతున్నారని ఎన్నారైలు తుమ్మల కిరణ్, కంచర్ల సుధాకర్, చలసాని కిశోర్, కొణిదెల లోకేష్ తదితరులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నుంచి దృష్టిని మరల్చేందుకే ఇటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, వీటిని ఎవరూ నమ్మరాదని కోరారు. ఇక తాజాగా చిరంజీవి తాజా డల్లాస్ పర్యటనలో గడ్డంతో ఉండగా, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియోలో గడ్డం లేకపోవడాన్ని గమనించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles