cherry to be the chief guest for bunny pre-release function ‘నా పేరు సూర్య’ ప్రి-రిలీజ్ కు ముఖ్యఅతిధిగా ‘‘చిట్టిబాబు’’

Ram charan to be the chief guest at allu arjun s pre release function for naa peru surya

Ram Charan, pre release event, Chief Guest, chiranjeevi, allu arjun, naa peru surya, en peru surya, en peru surya teaser, naa peru surya tamil teaser, allu arjun, anu emmanuel, vakkantham vamsi, movies, tollywood, entertainment

Allu Arjun is set to have a grand pre-release function for Naa Peru Surya. Which will take place on 29th April. Ram Charan will be the Chief Guest for his function.

‘నా పేరు సూర్య’ ప్రి-రిలీజ్ కు ముఖ్యఅతిధిగా ‘‘చిట్టిబాబు’’

Posted: 04/24/2018 04:38 PM IST
Ram charan to be the chief guest at allu arjun s pre release function for naa peru surya

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రానికి ఈ నెలాఖరున అంటే 29న హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు. ఇందుకోసం ఇప్పటికే చిత్రనిర్మాణ యూనిట్ అంతా సిద్దం చేసింది. అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా పంక్కతం వంశీ రూపోంచిన చిత్రం అడియో రిలీజ్ ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని మిలటరీ మాధవరం గ్రామంలో ఈ నెల 3న రిలీజ్ అయిన విషయం తెలిసింది.

కాగా, ఈ ప్రీరిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ రానున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్ కి చిరంజీవి రావలసిందట. అయితే ఆయన విదేశాల్లో ఉండటం వలన, చరణ్ వస్తున్నాడని అంటున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో బన్నీ వున్నాడు. ఇక అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అకట్టుకుంటున్నాయి. దీంతో సినీమాపై కూడా బన్ని అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

దయా గుణం చాటుకున్న బన్నీ:-

మిలిటరీ మాధవరం. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలపరిధిలోని ఈ గ్రామానికి దేశీయ మిలటరీ వ్యవస్థలోనే ఓ ప్రత్యేక గుర్తింపు కొనసాగుతూ వస్తుంది. దేశ ప్రజల రక్షణ కోసం ఈ గ్రామంలోని ప్రతీ ఇంటి నుండి ఒక వ్యక్తి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ.. రక్షణ కల్పిస్తున్నారు. యముకలు కోరికే చలిని సైతం లెక్కచేయకుండా పహారాగా కాస్తుంటారు.

ఈ గ్రామం నుండి దేశరక్షణలో భాగంగా వెళ్లి అమరులైన వీరులు ఎందరో వున్నారు. ఈ అమరవీరులకు కుటుంబాలకు తన వంతు సహాయం అందించి దయాగుణం చాటుకున్నాడు అల్లు అర్జున్. ఆ గ్రామంలో అమరులైన కుటుంబాలను సానుభూతి వ్యక్తం చేసి.. తన వంతుగా అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబ పెద్దల ఆశీర్వాదం పొందారు. ఇది స్టైలిష్ స్టార్ లో దాగిఉన్న మరో కోణాన్ని చూసి ఆ గ్రామం ప్రజలు, మెగా అభిమానులు చాలా సంతోష పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh