Kona Trolled for Supporting Salman Khan కోన వెంకట్ ను ట్రాల్ చేస్తున్న నెట్ జనులు

Kona trolled for supporting salman khan

kona venkat, salman khan, #Isupportsalman, netzens, black buck, trolled, social media, tollywood, bollywood, entertainment

With the hashtag #Isupportsalman, Kona Venkat supported Salman Khan big time trying to justify the actor’s act of killing animals, who is being heavily trolled for the way he supported the actor

కోన వెంకట్ ను ట్రాల్ చేస్తున్న నెట్ జనులు

Posted: 04/06/2018 08:16 PM IST
Kona trolled for supporting salman khan

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన తరుణంలో ఈ అగ్రహీరోకు శిక్ష పడటంపై బాలీవుడ్ నటులు ఇప్పటికే తమ ఆవేదన వ్యక్తం చేశారు. అది సరే కానీ టాలీవుడ్ డైరెక్టర్, రచయిత కోన వెంకట్ ను నెట్ జనులు ఎందుకు విమర్శిస్తున్నారనేగా మీ ప్రశ్న. ఎందుకంటే.. సల్మాన్ కు శిక్ష పడటంపై వెంకట్ స్పందిస్తూ.. ‘ఐ సపోర్ట్ సల్మాన్’ అనే హ్యాష్ టాగ్ తో ట్వీట్ చేశారు. ‘సల్మాన్ కేసులో కోర్టు తీర్పు విని ఆశ్చర్యపోయాను... దోషిగా తేలినంత మాత్రాన సల్మాన్ వ్యక్తిత్వంపై చర్చ జరపాల్సిన అవసరం లేదు ..  పర్యావరణ సమతుల్యతను కాపాడే నిమిత్తం జంతువుల వేటను చాలా దేశాల్లో ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి.. మొదట మనుషులను కాపాడాలి..’ అంటూ కోన వెంకట్ అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. ‘నిజమైన మనుషులు తమ సరదా కోసం జంతువులను వేటాడరు’, ‘వన్యప్రాణి సంరక్షణ చట్టాలు చదువుకో ఇంటర్నెట్ లో ఉంటాయి’, ‘మీలాంటి సెలెబ్రిటీల కోసం చట్టాలు, నిబంధనలు మార్చుకోవాలా!!! మా భారతదేశంలో అయితే ఇలాంటివి అనుమతించరు సార్.  కావాలంటే వేరే దేశాలకు మీరు వెళ్లి వేటాడుకోండి’ అంటూ చురకలు అంటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kona venkat  salman khan  #Isupportsalman  tollywood  bollywood  entertainment  

Other Articles