Rajinikanth's Kaala release may be postponed రజనీ అభిమానులకు చేధువార్త.. ‘కాలా’ వాయిదా

Rajinikanth s kaala has an important political message

anjali patil, anjali patil role in kaala, kaala, rajinikanth, kaala release date, rajikanth actor in kaala, kaala release date, kaala new release date

Ranjith's Kaala starring Rajinikanth and Huma Qureshi in lead roles. The film is scheduled to release on April 27, but it may be postponed due to the ongoing Tamil Nadu Producers' Council strike.

రజనీ అభిమానులకు చేధువార్త.. ‘కాలా’ వాయిదా

Posted: 04/06/2018 09:04 PM IST
Rajinikanth s kaala has an important political message

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మాఫియా డాన్ గా కనిపించనున్న చిత్రం కాలా. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.. స్టైల్ కి మారుపేరుగా నిలిచే రజనీకాంత్ ఈ చిత్రంలో ఎలాంటి కొత్త స్టైల్ తో ట్రెండ్ సెట్ చేయనున్నారో అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కొంత చేదు వార్తే. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 27వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల కావలసి వుంది. అయితే ఈ సినిమా ఆ రోజున థియేటర్స్ కి రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం తమిళనాట కొనసాగుతోన్న 'సమ్మె' అందుకు కారణం. అందువలన ఈ సినిమా ముందుగా చెప్పినట్టుగా ఏప్రిల్ 27వ తేదీన కాకుండా, జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ రజనీ అదే రోజున రావడం ఖాయమైతే, అప్పుడు ప్లాన్ చేసుకున్న సినిమాలవాళ్లు తమ విడుదల తేదీలను మార్చుకోవలసి ఉంటుంది. ఏదేవైనా రజనీ సినిమా విడుదల తేదీ వాయిదా పడటమనేది ఆయన అభిమానులను నిరాశకు గురిచేసే విషయమేనని చెప్పక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles