Sekhar Kammula responds on Sri Reddy's Allegations శ్రీరెడ్డికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్ట్రాంగ్ వార్నింగ్..

Apologise or face action sekhar kammula warns sri reddy

Sekhar Kammula Warns Sri Reddy, Sekhar Kammula responds on sri reddy allegations, Sekhar Kammula, Sri reddy, allegations, casting couch, Tollywood, movies, entertainment

Responding to actress Sri Reddy allegations, the director Sekhar Kammula, stated that he never met the actress, nor spoke to her on phone, he warned her either to apologise or to face stern legal action.

శ్రీరెడ్డికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్ట్రాంగ్ వార్నింగ్..

Posted: 04/03/2018 06:20 PM IST
Apologise or face action sekhar kammula warns sri reddy

కొందరు దర్శకులు, నిర్మాతలు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేస్తూ ఓ తెలుగు నటి సోషల్ మీడియాలో సంచలనాత్మక పోస్టులు పెట్టడం అది కాస్తా.. ప్రసారామాధ్యమాల్లో టెలికాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ అందుకోవడంతో పాటు.. డైరెక్టర్ తేజ నుంచి అమె ఓ ఆఫర్ కూడా దక్కించుకున్నారు. అయినా తన ధోరణి మార్చుకోకుండా ఏకంగా ప్రముఖ దర్శకుడి పేరును వెల్లడిస్తూ అమె చేసిన అసభ్యకర ట్వీట్ లు నేపథ్యంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన శ్రీరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఆయన ట్వీట్ సాగిందిలా.. ‘తనను కించపరుస్తూ, సోషల్ మీడియాలో సోమవారం రోజున వచ్చిన పోస్ట్, తన దృష్టికి వచ్చిందని. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అసత్యం, అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ తనను, తన కుటుంబానికి, తనను గౌరవించేవారికి చాలా బాధ కలిగించిందని అన్నారు. తాను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడని అమ్మాయి.. తన గురించి ఆధారం లేని అర్థరహిత ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

‘ఇది పూర్తిగా దిగజారుడు చర్యే. దీని వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏదైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. నేను నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.’ అని పేర్కొన్నారు శేఖర్‌ కమ్ముల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sekhar Kammula  Sri reddy  allegations  casting couch  Tollywood  movies  entertainment  

Other Articles