Chiranjeevi is quite proud says Mohan Babu రంగస్థలం చిత్రంపై మోహన్ బాబు ఏమన్నాడో తెలుసా.?

Mohan babu on ram charan s rangasthalam success

Ram Charan, Rangasthalam, Sukumar, Chiranjeevi, Mohanbabu, samantha, Rangasthalam Rs 100 crore club, Baahubali, SS Rajamouli, Sukumar, Aadi Pinisetty, Samantha Akkineni, Jagapathi Babu, Prakash Raj, Devi Sri Prasad, Chiranjeevi, Mega star, Mega powerstar, Ram Charan, rangasthalam, rangasthalam box office, rangasthalam movie, rangasthalam collection, ram charan, ram charan teja, telugu film, tollywoood

Veteran actor Mohan Babu is very much happy with the way Rangasthalam is currently doing at the box office. The actor took his Twitter and had appreciated the performance of Ram Charan and praised the entire film unit of Rangasthalam.

రంగస్థలం చిత్రంపై మోహన్ బాబు ఏమన్నాడో తెలుసా.?

Posted: 04/03/2018 05:30 PM IST
Mohan babu on ram charan s rangasthalam success

చిత్ర విడుదలకు ముందే.. తాను ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇది ఖచ్చితంగా ఓ మైలురాయిగా మిగులుతుందని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ చెప్పినట్లుగానే చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోవడం.. ఇక అటు కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఎంతో మంది సీనీ ప్రముఖులు ఈ చిత్రంపై స్పందిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించిన ‘రంగ‌స్థ‌లం’ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో రికార్డులను తిరగ రాస్తూ పరుగులు పెడుతోంది. చిత్రయూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయింది.
 
తాజాగా ‘రంగస్థలం’ సినిమాపై స్పందిస్తూ డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ఓ ట్వీట్ చేశారు. ‘రంగస్థలం సినిమా బాగుందని వింటున్నా. త్వరలో ఈ సినిమా చూస్తా. రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా ప్రత్యేక అభినందనలు. కొడుకులు ఎంచుకున్న రంగంలో ఉన్నత ప్రతిభ కనబర్చితే.. తండ్రులకు అంతకన్నా మించి మరేం కావాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నా.. నా ప్రియ స్నేహితుడు చిరంజీవి చాలా గర్వంగా ఉన్నాడని నాకు తెలుసు’ అని రాశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీ ట్వీట్స్, లైకులతో హోరెత్తిపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Rangasthalam  Sukumar  Chiranjeevi  Mohanbabu  samantha  Tollywood  entertainment  

Other Articles

Today on Telugu Wishesh