Aishwarya Explains Why She Loss Coll at Media | ఆ వార్త మరుసటి రోజు వస్తుందని తెలుసు.. అయినా స్పందించా!

Why aishwarya fire on media

Aishwarya Rai, Media, Lost Cool, Aishwarya Rai Interview, Aishwar Lost His Cool,

Aishwarya Rai reacts to losing her cool at media: I knew the next day headlines would be ‘Aishwarya got upset’. In November last year, Aishwarya Rai Bachchan along with mother Vrinda Rai and daughter Aaradhya Bachchan had attended an event organized by an NGO. She had lost her cool at the media present there. In a recent interview, she talked about the incident.

మీడియాపై ఐష్ ఎందుకు అసహనం వ్యక్తం చేసిందంటే...

Posted: 03/10/2018 10:05 AM IST
Why aishwarya fire on media

ఇండస్ట్రీలో ప్రశాంతమైన వ్యక్తిగా పేరొందిన ఐశ్వర్య రాయ్.. ఆ మధ్య మీడియాపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి కృష్ణరాజ్ రాయ్ జయంతిని పురస్కరించుకుని ఒక స్వచ్చంద సంస్థతో కలిసి 100 మంది గ్రహణం మొర్రి చిన్నారులకు గత నవంబర్ లో సర్జరీ చేయించింది. ఆ సందర్భంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేయగా.. ఆమె హాజరై కేక్ కట్ చేూసింది. ఆ సమయంలో మీడియా ప్రతినిధుల తీరుతో తీవ్ర అసహనానికి గురైంది.

మరుసటి రోజు మీడియాలో ఆమె అసహనం ప్రముఖంగా ప్రసారమైంది. దీనిపై ఎట్టకేలకు ఆమె స్పందించింది. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో నాటి ఘటనపై ఆమె స్పందించారు. ‘‘ఆ ఘటన గురించి చెప్పటం చాలా కష్టం. ఒక హాస్పిటల్ లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆవరణ చిన్నది కావటంతో తల్లిదండ్రులతో కలిసి చికిత్స కోసం వచ్చిన పిల్లలతో అక్కడ కిక్కిరిసిపోయింది. అలాంటి సమయంలో మీడియా అక్కడికి వచ్చింది. వారికి బైట్స్, ఫోటోస్ హడావుడి తప్ప అక్కడేం జరుగుతుందన్నది పట్టించుకోవడం లేదు. వాళ్లను చూసి పిల్లలు భయపడి ఏడ్చేశారు కూడా. దాంతో నేను తట్టుకోలేక మండిపడ్డా అని ఆమె తెలిపింది.

అయితే తన అసహనం మరుసటి రోజు హెడ్ లైన్స్ లో కనిపిస్తుందని కూడా తనకు తెలుసని ఆమె.. ఎవరినీ తప్పబట్టడం తన ఉద్దేశం కాదని పేర్కొంది. పరిస్థితులకు అనుగుణంగానే తాను స్పందిస్తానని.. ఆ రోజు నా స్థానంలో ఎవరున్నా తనలాగే రియాక్ట్ అయ్యేవారని ఆమె చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles