After Political Announcement Rajinikanth to head Spiritual Trip | రాజకీయాలకు ముందు ధ్యానంలో రజనీ

Rajinikanth again to himalayas

Rajinikanth, Himalayas, Spiritual Trip, Political Journey,

Rajinikanth Begins Annual Pilgrimage, To Meditate In Himalayas Before Political Journey.

ధ్యానంలో రజనీ.. హిమాలయాలకు వెళ్లాడు

Posted: 03/10/2018 11:16 AM IST
Rajinikanth again to himalayas

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాల పర్యటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ఆయన హిమాలయాలకు వెళ్తాడనే ప్రచారం జరిగింది. కానీ, ఆయన అక్కడికి వెళ్లిపోయారని సమాచారం.

గతంలోనూ తలైవా చాలాసార్లు హిమాలయాల్లోని దునగిరిలో ఉన్న గుహల్లోకి వెళ్లి ధ్యానం చేసి వచ్చారన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో మహా అవతార్‌ బాబాజీ నివసించాడని భక్తులు విశ్వసిస్తారు. కొన్ని నెలల క్రితం రజనీకాంత్, ఆయన మిత్రులు కలిసి అక్కడ ఓ ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వెళ్లినట్లు సమాచారం. రెండు వారాల పాటు ఆయన అక్కడే ఉన్నారు.

అయితే రాజకీయ అరంగ్రేటం ప్రకటన తర్వాత ఆయన వెళ్లటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఆధ్యాత్మికత రాజకీయాల్లో తమిళనాడులో మార్పులు తీసుకోస్తానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల పరంగా చూసుకుంటే 'కాలా', '2.0' చిత్రాలతో ఈ ఏడాది ఆయన పలకరించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles