No New Look for Venky for Teja Movie | రియలిస్టిక్ కోరుకుంటున్న వెంకీ.. వద్దంటున్న తేజ?

Venky look for teja movie

Venkatesh, Director Teja, Political Drama, Venky Look, Venkatesh New Look, Venkatesh Teja Movie Look

Venkatesh look for Teja Movie on board. Director wants new look but, Venky suggest no need to Change his beard look for Political Drama.

తేజ సినిమాలో వెంకీ లుక్కు ఎలా ఉంటుంది

Posted: 02/28/2018 11:37 AM IST
Venky look for teja movie

విక్టరీ వెంకటేష్ తన తర్వాతి చిత్రం తేజ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆటా నాదే వేటా నాదే పేరుతో పొలిటికల్ డ్రామాగా తేజ దీనిని తెరకెక్కించబోతున్నారు.

స్క్రిప్ట్ పనులు పూర్తయిపోగా.. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం కోసం వెంకీ లుక్కు మీదే ఇప్పుడు చర్చ మొదలైంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో అని ఆత్రుత మొదలైంది.

అయితే వెంకీ ఎక్కడికెళ్లినా గడ్డం లుక్కుతో దర్శనమిస్తున్నాడు. దీంతో ఇదే ఫిక్స్ అని అనుకుంటున్నారు. అయితే తేజ మాత్రం మరో లుక్కును కోరుకుంటున్నాడంట. వెంకీ మాత్రం తన ఏజ్ కు తగ్గట్లు ఇదే బావుంటుందని చెబుతుండటంతో దాదాపు ఇదే ఫిక్స్ అయినట్లు చెబున్నారు. శ్రీయా హీరోయిన్ గా చేయబోతున్న ఈ చిత్రంలో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles