Sye Raa second schedule Date Fixed | సైరా సెకండ్ షెడ్యూల్.. అతని వల్లే లేట్.. డేట్ ప్రకటించారు

Sye raa second schedule details

Sye Raa, Second Schedule, Chiranjeevi, Nayanathara, Amitabh Bachchan, Konidela Productions, March 5

Sye Raa second schedule to begin on March 5. The second schedule got deferred for unavoidable reasons. The buzz is that heroine Nayanthara and Amitabh Bachchan will participate in this schedule. The film is being bankrolled by Cherry for Konidela Productions.

సైరా సెకండ్ షెడ్యూల్ అప్పటి నుంచే...

Posted: 02/27/2018 05:58 PM IST
Sye raa second schedule details

స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'సైరా' సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇంతకుముందే పూర్తయింది. రెండవ షెడ్యూల్ షూటింగ్ ఈ పాటికే మొదలుకావలసి వుంది.

అయితే సినిమాటోగ్రఫర్ రత్నవేలు .. 'రంగస్థలం' సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల రీ-షూట్ లో బిజీగా ఉండటంతో, 'సైరా' షెడ్యూల్ ఆలస్యమైంది. ఈ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ మొదలు కానుందనేది తాజా సమాచారం.

చిరుతోపాటు.. నయనతార .. అమితాబ్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడి పేరు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa  Chiranjeevi  సై రా  చిరంజీవి  

Other Articles