Nagrajuna Turns Officer for Ram Gopal Varma | వర్మ కోసం ఆఫీసర్ గా మారిన నాగ్

Nag varma movie title fixed

Nagarjuna Akkineni, Ram Gopal Varma, Officer Movie, NagRGV4, NAGRGV4, Nagrajuna Varma Title

Nagarjuna Akkineni Next titled as Officer. Maverick Director Ram Gopal Varma Directs this Cop Story.

వర్మ-నాగ్.. ఆఫీసర్ టైటిల్ ఫిక్స్

Posted: 02/27/2018 05:25 PM IST
Nag varma movie title fixed

రాంగోపాల్ వ‌ర్మ – నాగార్జున క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తార‌ని, టైటిల్ ఏంటో ప్ర‌క‌టిస్తార‌ని చెప్పుకున్నారు. అయితే శ్రీదేవి హఠాన్మరణంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసిన వర్మ నేడు దానిని ప్రకటించేశాడు.

ఈ చిత్రానికి ‘ఆపీస‌ర్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇందులో నాగ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అందుకే… ఆ పేరు సెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ‘గ‌న్’, ‘డిపార్ట్‌మెంట్’ తదితర పేర్లు కూడా ప‌రిశీలించాక... చివ‌రికి ‘ఆఫీస‌ర్‌’ సెట్ట‌య్యింద‌ని తెలుస్తుంది.

ప్ర‌స్తుతం ముంబైలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. టైటిల్ లోగోతోపాటు మోషన్ పోస్టర్ ను కూడా వదిలాడు. మైరా సరిన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. వేస‌వికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles