Finally Shriya Saran all set to tie knot | కాదంటూనే పెళ్లికి సిద్ధమైన శ్రీయా శరణ్

Actress shriya wedding details

Shriya Saran, Andrei Koscheev, Marriage, Shriya Marriage, Actress Shriya Wedding

Shriya Saran to tie the knot in Udaipur with Andrei Koscheev in March. The actress will be tying the knot with her longtime beau Andrei Koscheev. The reports on her marriage continue with a few recently asserting that it will kick off on March 17. These reports suggest that it will be a three day affair to be held on March 17, 18 and 19 at Udaipur, Rajasthan. It also claims that the wedding will be performed as per Hindu rituals along with Sangeet and Mehendi. From what we hear, the theme will revolve around the upcoming festivity of Holi.

పెళ్లికి రెడీ అయిన శ్రీయా.. మార్చిలోనే ముహూర్తం

Posted: 02/27/2018 04:30 PM IST
Actress shriya wedding details

ప్రముఖ నటి శ్రియ శరణ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. రష్యన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రికోచివ్ ని శ్రియ వివాహమాడుతుందని సమాచారం. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో శ్రియ-ఆండ్రికోచివ్ పెళ్లి ఘనంగా జరగనుందని, మూడు రోజుల పాటు ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మార్చి 17,18, 19 తేదీల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇదిలా ఉంచితే, ఇటీవల తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను శ్రియా ఖండించిన విషయం తెలిసిందే. ఇటీవల షాపింగ్ చేసిన విషయమై శ్రియను ప్రశ్నించగా, తన స్నేహితురాలి వివాహం ఉండటంతో షాపింగ్ చేశామే తప్ప, తన పెళ్లి కోసం కాదని చెప్పింది.

అయితే, శ్రియా పెళ్లి కన్ఫర్మ్ అయినట్లేనంటూ బాలీవుడ్ మీడియాలో మళ్లీ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా వార్తలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే శ్రీయా ప్రస్తుతం వెంకీ ఆటా నాదే-వేటా నాదే చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh