Samantha Did It for U-Turn Only with Special Interest | ఆ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ తో సామ్ ఏం చేసిందంటే...

Samantha cut off her remuneration

Samantha Akkineni, U-Turn Movie, Remuneration, Cut-Off, Rajahmundry, Samantha U-Turn Shooting, Samantha New Movie

Samantha Akkineni Cut Off Her Remuneration for U-Turn Movie. She Had Special Interest on this Project from Beginning. Recently U-Turn shooting starts in Rajahmundry.

రెమ్యునరేషన్ తగ్గించుకున్న సమంత

Posted: 02/21/2018 11:29 AM IST
Samantha cut off her remuneration

పెళ్లయ్యాక కాస్త కూడా గ్యాప్ తీసుకోకుండా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమంత ఇప్పుడు దాదాపు అరడజను ప్రాజెక్టులపై దృష్టిసారించింది. తెలుగులో రంగస్థలం, మహానటితోపాటు ఈ మధ్యే యూటర్న్ షూటింగ్ ను షురూ చేసేసింది. తమిళ్ లో విశాల్ ఇరుంబు తిరై (అభిమన్యుడు) రిలీజ్ కు రెడీ కాగా, విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తూ మరో ప్రాజెక్టుకు కూడా ఆల్ మోస్ట్ ఓకే చెప్పిందని చెబుతున్నారు.

ఇక సమంత ఎప్పటి నుంచో వర్కవుట్ చేస్తున్న యూ-టర్న్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసన ప్రాంతాల్లో జరుపుకుంటోంది. సామ్ తోపాటు పలువురు తారాగణంపై సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆమె రెమ్యూనరేషన్ ను బాగా తగ్గించేసుకుందని తెలుస్తోంది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడం వలన ఓ మాదిరి బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతోందని అంటున్నారు. సమంత కెరియర్లో అతి తక్కువ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉండటం వల్లే ఆమె ఆ పని చేసిందంట.

మరో పక్కన రంగస్థలం సినిమాతో వచ్చేనెల చివరిలో సమంత ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుకున్న సమయానికి మహానటి పనులు పూర్తయితే చెప్పినట్లుగా మార్చి 29న విడుదలయితే మాత్రం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఈ బ్యూటీ సందడి చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles