Ileana Slams South Films Directors | అసలు సౌత్ సినిమాల్లో ఎలా నటించానో అర్థం కావట్లేదు : ఇలియానా సంచలన వ్యాఖ్యలు

Ileana sensational comments on south directors

Ileana D’Cruz, South Film Industry, Ileana South Directors, Interview, Ileana Interview, Raid Movie, Ileana on South Movies, Ileana Sensational Comments, Ileana Aata Movie

Ileana D’Cruz Sensational Comments on South Film Directors. Ileana ruled Tollywood a decade ago. She was in the top slot and one of the highest paid actresses then. She has been a part of some big films in Tollywood, acted with top actor and worked with big directors. It was Tollywood that gave her fame, name and money. But looks like our Ileana is not very grateful about this. “I only thought of getting done with it fast. Though I was not necessarily always comfortable about the fact that there used to be lots and lots of shots around my waist, it was something that I dealt with. In Bollywood, at least, I don’t see that happening so much.”

సౌత్ డైరెక్టర్లపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు

Posted: 02/20/2018 05:47 PM IST
Ileana sensational comments on south directors

'దేవదాసు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన గోవా అందం ఇలియానా దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు సినిమాల్లో తనను 'అందాల వస్తువు'గానే చూపించారని తెగ ఆవేదన చెందింది. ఇటీవల ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె పలు విషయాలను తెలిపింది.

మొదటి చిత్రంలో ఫస్ట్ షాట్ బొడ్డుపై శంఖం వేసే సీన్ ను చిత్రీకరిస్తున్నారు. అలా ఎందుకు అని దర్శకుడిని ప్రశ్నిస్తే.. మీ నడుము అందంగా ఉంది. సీన్ ఇంకా బాగా వస్తుంది. ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అంటూ సమాధానమిచ్చాడంట. దీంతో ఆమె నవ్వి ఊరుకుంటుందంట. తన తొలి చిత్రం మాత్రమే కాదు.. తర్వాత కూడా అంగాంగ ప్రదర్శనకే ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపింది. పోకిరి, కేడీ, ఖతర్నాక్, మున్నా చిత్రాల తర్వాత 'ఆట' సినిమా చేసేటప్పుడు కూడా తనను అందాల వస్తువుగానే చూపించడం చాలా ఇబ్బందికరంగానూ, బాధగానూ అనిపించినట్లు చెప్పింది. 'అయ్యిందేదో అయ్యింది. ఇక చాలు' ఈ సినిమా ఆపేద్దాం అని ఆట సినిమా గురించి అనుకున్నానని.. కానీ, కాస్త ఓర్చుకుంటే అయిపోతుందని భావించి ఆగిపోయానని ఆమె చెప్పారు.

అయితే తాను చేసిన చిత్రాల్లో పవన్‌తో చేసిన జల్సా, రవితేజతో నటించిన కిక్ చిత్రాల్లో తన పాత్రలు భిన్నంగా వున్నాయంటూ ఆ రెండు చిత్రాలు మాత్రం తనకు బాగా నచ్చాయని ఆమె చెబుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ దర్శకుల టేకింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇలియానా.. బాలీవుడ్ లో అలాంటి పరిస్థితులు ఎదురు కాకూడదని కోరుకుంటుందంట. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్ సరసన రైడ్ చిత్రంలో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana D’Cruz  Latest Interview  

Other Articles