Ram Charan Double Treat for fans with Rangasthalam | రంగస్థలం.. చెర్రీ రెండు చోట్ల సందడి!

Rangasthalam audio

Ram Charan, Rangasthalam, Rangasthalam Ram Charan, Rangasthalam Audio EVent, Rangasthalam Pre Release Event, Rangasthalam Vizag Hyderabad, Rangasthalam Promotions, Samantha, Director Sukumar, Jagapathi Babu

Ram Charan Double Treat for Fans with Rangasthalam. Movie Pre Release Event at Hyderabad and Audio Release Event at Vizag Soon, Samnatha plays lead and Jagapathi Babu, Anasuya in other Pivotal Roles under Sukumar Direction.

రంగస్థలం ఆడియోతోపాటు ప్రీ రిలీజ్ వేడుక కూడా

Posted: 02/20/2018 04:53 PM IST
Rangasthalam audio

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రంగస్థలం' సినిమా దాదాపు షూటింగును పూర్తి చేసుకుంది. టీజర్, సాంగ్స్ ఒక్కోక్కటిగా విడుదల చేస్తున్న చిత్ర యూనిట్ ఇక ప్రమోషన్లను వేగవంతం చేసే పనిలో నిమగ్నమైపోయింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మిగతా పనులను చకచకా పూర్తిచేయడంలో టీమ్ నిమగ్నమై ఉంది.

తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకను వైజాగ్ లో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రంగస్థలం కోసం రెండు ఈవెంట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆడియో వేడుకతోపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, మార్చి 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనేది ఖరారు చేసుకున్నారు.

ఇక ఆడియో వేడుకకు డేట్ ను ఖరారు చేసే పనిలో వున్నారు. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు .. ఆది పినిశెట్టి .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆడియోలో భాగంగా తర్వాత రంగమ్మ మంగమ్మ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh