తెలుగులో రెజీనాకి మంచి క్రేజ్ వుంది. నటిగా కూడా ఆమెకు మంచి మార్కులు వేయొచ్చు. అయితే ఆ క్రేజ్ ను పెంచే సినిమాలు వెంటవెంటనే పడకపోవడంతో ఆమె కెరియర్ కాస్త మందగించింది. చేసిన చిత్రాలు ఫెయిల్యూర్స్ కావటం.. తమిళ్ లో కూడా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో ఆ మధ్య బాలీవుడ్ వైపు చూసింది.
ఆ మధ్య ఆమెకి ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. 'ఆంఖేయిన్ 2' సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ, కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. దీంతో ఆమె నిరాశలోకి కూరుకుపోయింది. అయితే బాలీవుడ్ నుంచి ఇప్పుడు ఆమెకి మరో ఛాన్స్ తగిలింది.
సోనమ్ కపూర్, రాజ్ కుమార్ రావ్ .. అనిల్ కపూర్ .. జుహీ చావ్లా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న 'ఏక్ లడ్కికో దేఖతో ఐసా లగా' సినిమాలో ఆమెకి అవకాశం దక్కింది. చాలామంది కథానాయికలకు ఆడిషన్స్ నిర్వహించిన దర్శకుడు షెల్లీ చోప్రధర్, రెజీనానే ఖరారు చేశాడట. అయితే అది గెస్ట్ రోల్ మాత్రమే అని తెలుస్తోంది. ఈ సినిమాతో అయినా తన కెరీర్ ను రెజీనా చక్కబెట్టుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 27 | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు విడదలకు ముహూర్తం ఫిక్స్ చేయడంపై బాలీవుడ్ నిర్మాత కస్సుబుస్సులాడుతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా మెగా... Read more
Jan 27 | తెలుగు మహానటి చిత్రంలో నటించిన సావిత్రి తరువాత అమె పోందిన గౌరవాన్ని పోందిన హీరోయిన్లలో ప్రస్తుతం కీర్తి సురేష్ ఒకరు. హోమ్లీ హీరోయిన్ గా ప్రేక్షకులకు చేరువైన ఈమె.. వరుస చిత్రాల ఆఫర్లు వచ్చినా..... Read more
Jan 27 | మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు... Read more
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more