Priyanka Chopra allegedly sues Nirav Modi for Cheating | నీరవ్ మోదీపై ప్రియాంక చోప్రా కేసు వేసేసిందే!

Priyanka chopra sued on business merchant

Priyanka Chopra, Nirav Modi, Diamond Jewellery House, Punjab National Bank Fraud, PNBF, Priyanka Chopra Sues, Priyanka Chopra Nirav Modi

Actor Priyanka Chopra, the global brand ambassador of Nirav Modi diamond jewellery house, sued the designer's company for defrauding her. However, after the news of his alleged fraudulent transactions broke, his tryst with some Bollywood celebrities have also resurfaced. Modi, who has been named in Punjab National Bank's 11000 crore fraud. Chopra's management has alleged that she wasn't paid the amount the two parties had agreed on.

ప్రముఖ వజ్రాల వ్యాపారిపై ప్రియాంక చోప్రా దావా

Posted: 02/15/2018 03:40 PM IST
Priyanka chopra sued on business merchant

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దావా వేసింది. నీరవ్ కు చెందిన డైమండ్ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించే తనకు ఓ వ్యాపార ప్రకటనకు సంబంధించిన పారితోషికం ఆయన ఎగ్గొట్టారంటూ కోర్టులో దావా వేసినట్టు తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ప్రియాంక ఈ వ్యాపార ప్రకటనలో నటించింది. ఈ వ్యాపార ప్రకటనకు సంబంధించిన పారితోషికాన్ని ఆమెకు, సిద్ధార్థ్ మల్హోత్రాకు ఇంత వరకూ ఇవ్వలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, పీఎన్ బీలో నీరవ్ మోదీ కుంభకోణం బయటపడటంతో నీరవ్ సన్నిహితులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు అతనికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.

సరైన లెక్కా పత్రాలు లేకున్నా.. అధికారులతో కుమ్మక్కు అయిన ఈ ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ అతడి గ్యాంగ్ కారణంగా భారీ స్కాం చోటు చేసుకుంది. ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చెందిన ఒక బ్రాంచ్ ద్వారా రూ.11346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. బ్యాంకు సిబ్బందితో కలిసి 2011 నుంచి ఈ దారుణానికి పాల్పడుతున్న వైనం బయటకు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles