Movie Offers Flow for Priya Prakash Varrier | నిఖిల్ మూవీలో ప్రియా వారియర్.. రెమ్యునరేష్ ఎంత డిమాండ్ చేసిందంటే...

Priya warrier movie offers

Priya Prakash Varrier, Nikhil Siddharth, Tharun Bhascker, Omar Lulu, Oru Adaar Love, Priya Varrier Nikhil

Internet Sensation Priya Prakash Varrier Consider for Nikhil Siddharth's Next under Tharun Bhascker Direction. But, Huge Remuneration demand by Omar Lulu her manager cum Director of Oru Adaar Love.

నిఖిల్ మూవీలో ప్రియా వారియర్

Posted: 02/15/2018 04:01 PM IST
Priya warrier movie offers

సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ సెన్సేషన్ గా మారిపోయింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ఒక్క పాట.. కాదు కాదు... అందులోని ఒక్క కంటి విరుపుతో ఇన్ స్టాగ్రామ్ ద్వారా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఏ మీడియా ఛానెళ్లను చూసినా దాదాపు.. ప్రియా ప్రకాశ్ వారియర్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు ఈ బ్యూటీకి మలయాళంతో పాటు ఇటు ఇతర భాషల్లో కూడా ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టాలీవుడ్ .. బాలీవుడ్ నుంచి కూడా ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయట. నిఖిల్ .. తరుణ్ భాస్కర్ ఒక సినిమా చేయాలనుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రియా ప్రకాశ్ ను సంప్రదించగా, ఆమె డేట్స్ చూస్తోన్న దర్శకుడు ఒమర్ లులు .. రెండు కోట్లు డిమాండ్ చేశాడట.

దీంతో కాస్త తగ్గించుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మాయిని తమ సినిమాల కోసం మాట్లాడమని మరి కొంతమంది కుర్ర హీరోలు కూడా దర్శక నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles