Mehbooba Teaser Interesting and Promising | మెహబూబా టీజర్.. పూరీలోని కొత్త కోణం

Puri mehbooba teaser out

Puri Jagganath, Mehbooba Movie, Mehbooba Teaser, Akash Mehbooba Teaser, Akash Puri Next, Mehbooba First look Teaser

Puri Jagganath Mehbooba Teaser Out. Puri comes with new idea of 1971 war back drop. Akash Puri and Neha Shetty in Lead Roles.

మెహబూబా టీజర్.. కొత్తగా పూరీ ప్రయత్నం

Posted: 02/09/2018 03:09 PM IST
Puri mehbooba teaser out

త‌న కుమారుడు ఆకాశ్‌ పూరీని హీరోగా(పూర్తి స్థాయిలో) ప‌రిచ‌యం చేస్తూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘మెహబూబా’ సినిమాని రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. 1971 బార్డర్ నేపథ్యంలో ఓ లవ్ స్టోరీగా పూరీ దీనిని తెరకెక్కించాడు. హాలీవుడ్ స్ఠాయిలో ఉన్న విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ లను ఆసక్తికరంగా కట్ చేసే పూరీ మరోసారి మెహబూబాతో అదే మ్యాజిక్ చేశాడు. ఆకాశ్, నేహా శెట్టిలు లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుద‌లైన నేప‌థ్యంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు దీనిపై స్పందించారు.

  • పూరీ జగన్నాథ్‌ సినీ కెరీర్‌లోనే ఉత్తమమైన సినిమాలా ఉందని, ‘మెహబూబా’ అన్ని ప్రేమకథలను మేళవించి తీసినట్లు ఉందని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశారు.
  • ఈ సినిమా టీజ‌ర్ అద్భుతంగా ఉంద‌ని, ఆకాశ్‌కి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని న‌టి ప్రియ‌మ‌ణి ట్వీట్ చేసింది.
  • టీజర్‌ చాలా చాలా బాగుంది. పూరీ, ఆకాశ్‌ కాంబినేషన్లో ఈ సినిమా‌ రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా’ అని న‌టుడు వ‌రుణ్ తేజ్ పేర్కొన్నాడు.
  • వావ్ పూరీ స‌ర్.. సూప‌ర్బ్ అని ద‌ర్శ‌కుడు అనిల్ రవిపూడి, ర‌చ‌యిత కోన వెంక‌ట్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles