Chitti Babu Love Rama Lakshmi in Rangasthalam | రంగస్థలంలో రామలక్ష్మి.. సిట్టిబాబు గుండెను గోలెట్టించేసింది

Samantha as rama lakshmi

Rangasthalam, Samantha Akkineni, Rangasthalam Second Teaser, Rangasthalam Rama Lakshmi

Rangasthalam Second Teaser. Samantha Akkineni’s deglam look is like a breath of fresh air.

రంగస్థలం టీజర్.. రామలక్ష్మిగా సమంత

Posted: 02/09/2018 03:31 PM IST
Samantha as rama lakshmi

సుకుమార్, రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న 'రంగ‌స్థ‌లం' సినిమాలో హీరోయిన్‌ని చూపెడుతూ ఈ రోజు టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పల్లెటూరి పడుచుపిల్లలా సమంత చెరువు వద్ద బట్టలు ఉతుకుతూ, నీళ్లు తీసుకొస్తూ, కట్టెలు మోస్తూ కనపడుతోన్న ఈ టీజర్ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

రామలక్ష్మి వయ్యారాల గురించి సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు అదేనండీ మన చెర్రీ వర్ణించిన విధానం. ఆ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. అయితే మూగమ్మాయి అన్న విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూ డైలాగ్ లేకుండా టీజర్ ను దర్శకుడు సుకుమార్ కట్ చేశాడు. ఇక ఈ టీజర్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

'నువ్వు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డంలో ఎప్పుడూ విఫ‌లం కావు స‌మంత' అంటూ హీరో నితిన్ ట్వీట్ చేశాడు. సూప‌ర్ స‌మంత అంటూ అక్కినేని అఖిల్ పేర్కొన్నాడు. రామ‌ల‌క్ష్మీని స్క్రీన్‌పై చూడాల‌ని ఉంద‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. 'రామ‌లక్ష్మి... సమంత కెరీర్‌కే ది బెస్ట్ క్యారెక్టర్' అని షాలిని పాండే పేర్కొంది. 'రామలక్ష్మి నా హృదయాన్ని ఎక్కడికో తీసుకెళ్లావ్' అంటూ మెహ్రీన్ ఫిర్జాదా పేర్కొంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Samantha  Teaser  రంగస్థలం  సమంత  టీజర్  

Other Articles