Dwayne Johnson Skyscraper Trailer Out | రాక్ ‘స్కై స్క్రేపర్’ ట్రైలర్.. ధైర్యానికి హద్దులు లేవు

Skyscraper trailer out

Skyscraper, Dwayne Johnson, Skyscraper Trailer, Rock Skyscraper Movie, Skyscraper Director, Skyscraper

Skyscraper Trailer Released. Dwayne Johnson. Skyscraper finds Johnson as former FBI hostage rescue team leader and war veteran Will Sawyer. On assignment in his new gig as a security consultant, he's called in to check out a brand new building in China, touted as the tallest and safest in the world. Only one of those turns out to be true, as the place comes under flaming attack.

రాక్ స్కై స్క్రేపర్ ట్రైలర్ వచ్చేసింది

Posted: 02/05/2018 05:15 PM IST
Skyscraper trailer out

రెజ్లింగ్ స్టార్ రాక్ అలియాస్ డ్వెయిన్‌ జాన్సన్‌(అసలు పేరు) హాలీవుడ్ లో రంగప్రవేశం చేసి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.  గతేడాది బేవాచ్ నిరాశపరిచినా..జుమాంజీ2 మాత్రం విపరీతమైన లాభాలను తీసుకొచ్చి పెట్టింది. తాజాగా ఆయన నటించిన మరో చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది.

స్కైస్క్రేపర్ సినిమా ట్రైలర్ ను దర్శకుడు రాసన్‌ మార్షల్‌ థర్బర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో డ్వెయిన్ మాజీ ఎఫ్బీఐ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాలు కోల్పోయి, కృత్రిమ కాలుతో కుటుంబం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా డ్వెయిన్ నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ట్రైలర్ లో 240 అంతస్తుల భవనంలో డ్వెయిన్ కుటుంబం చిక్కుకోగా, వారిని కాపాడేందుకు ఆ భవనంపై నుంచి దూకడాన్ని ఆసక్తికరంగా చూపారు. 

ఈ సినిమా లెజెండరీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థ నిర్మిస్తుండగా, దీనికి సహనిర్మాతగా డ్వెయిన్‌ జాన్సన్‌ వ్యవహరిస్తుండడం విశేషం. జులై 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles