Keerthy Suresh Clears air on Clash with Trisha | సినిమా గోడవ.. త్రిష చెప్పేసింది. మరి కీర్తి ఏం చెబుతోంది?

Keerthy suresh clash with trisha

Keerthy Suresh, Saamy Square, Trisha Krishnan, Keerthy Suresh Trisha Clash, Trisha Saaamy Square

Keerthy Suresh clears Air on Clash with Trisha over Saamy Square. She has no differences with Trisha.

త్రిషతో నాకేం గొడవలేదు : కీర్తి సురేష్

Posted: 02/05/2018 06:53 PM IST
Keerthy suresh clash with trisha

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు త్రిష, కీర్తి సురేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్టేజీకి చేరుకుందంటూ కోలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 'సామి' సీక్వెల్‌ 'సామి స్క్వేర్‌'ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర మొదటి భాగంలో విక్రమ్ సరసన త్రిష నటించగా.. సీక్వెల్‌లో ఆమెతో పాటు కీర్తి సురేష్‌ను కూడా ఎంచుకున్నాడు దర్శకుడు.

అయితే ఏమైందో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వచ్చేసింది త్రిష. అయితే త్రిష అలా బయటకు రావడానికి కీర్తి సురేష్ కారణమని పలు వార్తలు వచ్చాయి. దాంతో తాజాగా వాటిపై స్పందించింది కీర్తి. ఈ సినిమాలో త్రిషతో తనకు ఒక్క సీన్ కూడా లేదని.. ఈ సినిమా నుంచి ఆమె వెళ్లిపోయినందుకు, తనకు సంబంధం లేదని చెప్పింది. ఇలాంటి విషయాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని.. ఆమె తప్పుకున్నందుకు కారణం కూడా తెలీదని పేర్కొంది.

మరోవైపు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన త్రిష.. "కొన్ని కారణాల వలనే ఇందులో నటించడం లేదని, టీంకు ఆల్ ది బెస్ట్" అంటూ కామెంట్ పెట్టింది. ఇప్పుడు కీర్తి క్లారిటీతో అదంతా ఉత్తదేనని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles