Senior Composer Confirmed for Nag Nani Multi starrer | క్రేజీ మల్టీస్టారర్.. మణిశర్మ మ్యూజిక్

Nag nani movie music director confirmed

Nagarjuna Akkineni, Nani, Sriram Aditya, Nagarjuna Nani Movie, Sriram Aditya Mani Sharma, Mani Sharma Next, Mani Sharma 2018 Movies

Nagarjuna Akkineni Nani Multi Starrer Music Director Confirmed. Mani Sharma finalized for this crazy movie directed by Sriram Aditya.

నాగ్-నాని మల్టీస్టారర్ కు మణిశర్మ మ్యూజిక్

Posted: 02/05/2018 04:36 PM IST
Nag nani movie music director confirmed

మణిశర్మ గత కొంత కాలంగా బడా చిత్రాలకు సంగీతం అందించటం మనం చూడట్లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఆయన అదరగొడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ క్రేజీ మల్టీస్టారర్ కు సంగీతం అందించబోతున్నట్లు సమాచారం.

కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ సి.అశ్వినీద‌త్ ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా.. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఎంపిక‌య్యార‌ని తెలిసింది. అశ్వ‌నీద‌త్‌, నాగ్‌, నాని, శ్రీ‌రామ్ ఆదిత్య‌.. ఇలా ఈ న‌లుగురితోనూ గ‌తంలో మ‌ణిశ‌ర్మ ప‌నిచేయ‌డ‌మే కాకుండా.. విజ‌యాల‌ను కూడా అందించారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం క‌థానాయిక‌ల ఎంపిక జ‌రుగుతోంది. నాని సరసన రకుల్, నివేదా థామస్ పేర్లు పరిశీలనలో ఉండగా, నాగ్ కోసం ఓ సీనియర్ నటి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles