Upasana Sleepless Night after watch Bhaagamathie | భాగమతి చూసి భయంతో నా భార్య రాత్రంత నిద్రపోలేదు : చెర్రీ

Ram charan praise bhaagamathie

Bhaagamathie, Ram Charan, Upasana, Anushka Shetty, Bhaagamathie Upasana, Upasana Fears Bhaagamathie, Anushka Fears Upasana

Mega Power Star Ram Charan Praise Bhaagamathie after watching along with wife Upasana. Bhaagamathie also replied for that Facebook Post.

భాగమతి అద్భుతంగా ఉంది : రామ్ చరణ్

Posted: 02/02/2018 09:48 AM IST
Ram charan praise bhaagamathie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు ఏదైనా చిత్రం నచ్చితే చాలూ వెంటనే దానిపై అభిప్రాయాన్ని ఖుల్లాగా చెప్పేస్తుంటాడు. తాజాగా అనుష్క శెట్టి నటించిన భాగమతి చిత్రాన్ని చూసిన చెర్రీ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్టును ఉంచాడు.

‘‘రాత్రి ‘భాగమతి’ సినిమా చూశాను. మైండ్ బ్లోయింగ్ నటనతో అనుష్క ఆకట్టుకుంది. టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. భాగమతి టీమ్ గురించి చెప్పాలంటే.. కేక. టీమ్ అంతా చాలా కష్టపడింది. వారందరికీ శుభాకాంక్షలు. ‘భాగమతి’ సినిమా చూసిన తర్వాత భయంతో నా భార్య రాత్రి నిద్రకూడా పోలేదు’’ అని రాంచరణ్ తేజ్ తెలిపాడు.

దీనికి ఆ చిత్ర బృందం వెంటనే స్పందిస్తూ, ‘‘జనాలను నిద్రపోనివ్వకూడదనే మా లక్ష్యం నెరవేరింది. థ్యాంక్యూ రామ్ చరణ్ గారు, మా కష్టాన్ని గుర్తించినందుకు’’ అంటూ ధన్యవాదాలు తెలిపింది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ 50 కోట్ల కలెక్షన్లు దాటి దూసుకెళ్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles