Nag and Nani Movie Launch Date Fixed | నాగ్-నాని.. ఫిబ్రవరి 24న క్లాప్!

Nag multi starrer launch date fixed

Nagarjuna Akkineni, Nani, Sriram Aditya, Bhale Manchi Roju, Vyjayanthi Movies Banner, Multi Starrer, Nag Nani Movie Launch Details

Nagarjuna Akkineni and Natural star Nani are all set to start a multistarrer. It seems like the duo you are planning to launch their film and organize the Pooja ceremony on February 24th. Vyjayanthi Movies banner bankrolling this project. Bhale Manchi Roju, Shamanthakamani fame Sriram Aditya is helming this multi starrer.

నాగ్-నాని మల్టీస్టారర్ మూవీ లాంఛ్ డేట్

Posted: 01/31/2018 04:02 PM IST
Nag multi starrer launch date fixed

టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ కు ముహుర్తం కుదరింది. అగ్రనటుడు నాగార్జున అక్కినేని, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ చిత్రం తెరకెక్కనుందని గత కొంత కాలంగా చెప్పుకుంటున్నాం. భలేమంచి రోజు, శమంతకమణి ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న అఫీషియల్ గా లాంఛ్ చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ తయారు చేసిన శ్రీరామ్.. ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యం ఉండేలా పాత్రలను తీర్చి దిద్దాడని తెలుస్తోంది.

మార్చి మధ్య నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారంట. సమ్మర్ లో కూల్ గా విదేశీ లోకేషన్లలో షూట్ చేసే ఫ్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్లు, ఇతర తారాగణం.. టెక్నీషియన్ల వివరాలు లాంఛ్ రోజే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగ్ ఆర్జీవీ చిత్రంలో నటిస్తుండగా.. నాని కృష్ణార్జున యుద్ధం చిత్రంతో బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna Akkineni  Nani  Sriram Aditya  

Other Articles