Popular South Singer Now turns Hero | జేసుదాస్ కొడుకు ఇప్పుడు హీరో అయ్యాడు!

Vijay yesudas turns hero

Padaiveeran, Vijay Yesudas, Bharatiraja, Padaiveeran Trailer, Padaiveeran Actress Amrutha, Padaiveeran Vijay Yesudas

Popular Singer Vijay Yesudas turns hero with Padaiveeran. The trailer of Padaiveeran released and Bharatiraja play an important role, Amurutha as Heroine directed by Dhana.

హీరో అవతారంలో విజయ్ జేసుదాసు

Posted: 01/31/2018 03:06 PM IST
Vijay yesudas turns hero

లెజెండరీ సింగర్ యేసుదాసు తనయుడు విజ‌య్ యేసుదాసు ఇంతకాలం మనకు సింగర్ గానే పరియం. తొలిసారిగా అతను హీరో అవతారం ఎత్తాడు. ‘ప‌డైవీర‌న్‌’ పేరుతో ధనా దర్శకత్వంలో తెరెక్కిస్తున్న చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లైంది.

ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో కథ తెరకెక్కింది. పని పాట లేకుండా తిరిగే ఓ కుర్రాడు పోలీస్ కావాలని కలలు కంటాడు. తీరా అంతా జరిగి ట్రెయినింగ్ అయ్యాక దొంగలు ఎక్కువగా ఉండే ఓ గ్రామానికి డ్యూటీ మీద వెళ్తాడు. అక్కడి మనుషులు పోలీసులను నిర్దాక్షిణ్యంగా చంపుతుంటారు. మరి వాళ్ల ఆటను హీరో ఎలా కట్టించాడు అన్న కథతోనే ఈ చిత్రం తెరకెక్కింది. సీనియర్ నటుడు, దర్శకుడు భారతీ రాజా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఆయన పాత్రను ధనా చాలా చలాకీగా తీర్చి దిద్దాడు. హీరోయిన్ అమృత కూడా చాలా క్యూట్ గా ఉంది.

ఈ ట్రైలర్ గా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్తీక్ రాజా మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ఈ చిత్రం విడుద‌ల‌కాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles