Arshi Khan Not Liar doing Prabhas Movie | ప్రభాస్ సినిమాలో ఉన్నా.. ఇదిగో ఫ్రూఫ్ లు...

Arshi khan about prabhas movie

Arshi Khan, Arshi Khan Prabhas, Prabhas Saaho Movie, Saaho Arshi Khan, Baahubali Prabhas Arshi Khan

Arshi Khan rubbishes reports of faking news about working with Prabhas, shows contract papers.

నిజం.. నేను ప్రభాస్ మూవీలో ఉన్నా : అర్షి ఖాన్

Posted: 01/31/2018 06:15 PM IST
Arshi khan about prabhas movie

నటి, మోడల్ ఆర్షి ఖాన్ ప్రభాస్ సినిమాలో చేయబోతున్నానని ప్రకటించి వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. అయితే అదంతా ఫేక్ అంటూ బాలీవుడ్ లో కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. నిర్మాతలను తాము సంప్రదించామని.. వారు కూడా అది అబద్ధమని చెప్పారని వార్తలు ఇచ్చాయి. దీంతో అర్షి ఖాన్ సంప్రదించింది. పేరు తెచ్చుకోవడం కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని, తాను నిజంగానే ప్రభాస్‌ సినిమాలో నటించబోతున్నానని చెప్పింది.

బిగ్ బాస్ సీజన్ 11 ఫేమ్, నటి అర్షి ఖాన్‌ చెప్పింది. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత హైదరాబాద్‌ నుంచి వచ్చిన నిర్మాతలు తనను కలిశారని చెప్పింది. దీంతో వారిని తాను ముందు ఆ సినిమాలో నటిస్తున్న హీరో, హీరోయిన్ల వివరాలు ఆరాతీయగా, ఈ సినిమాలో ప్రభాస్‌ నటించబోతున్నాడని వారు తనతో చెప్పారని తెలిపింది. అనంతరం తనతో ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారని చెప్పింది. ఆ తరువాత వారు తనకు రెండు, మూడు సార్లు ఫోన్‌ కూడా చేశారని తెలిపింది. నిర్మాతలతో టచ్‌ లో ఉన్నానని అర్షిఖాన్ తెలిపింది.

ఫిబ్రవరి 17 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పింది. నిర్మాతలు చెప్పిన విషయాన్నే తాను ట్వీట్ చేశానని, పేరు కోసం తప్పు చెప్పాల్సిన అవసరం తనకు లేదని అర్షి ఖాన్ స్పష్టత ఇచ్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arshi Khan  Prabhas  అర్షి ఖాన్  ప్రభాస్  

Other Articles