Comedian Priyadarshi to tie the knot soon | నా సావు నేను సస్తా... పెళ్లి చేసుకుని!

Wedding bells comedian priyadarshi

Comedian Priyadarshi, Priyadarshi Wedding Bells, Priyadarshi Marriage, Priyadarshi Richa Sharma, Pelli Choopulu Comedian Wife, Comedian Priyadarshi Wife

Pelli Choopulu Fame Priyadarshi, is reportedly getting married next month. He will marry a girl named Richa Sharma on February 23. The wedding event will take place in Hyderabad.

పెళ్లికి రెడీ అయిన కమెడియన్ ప్రియదర్శి

Posted: 01/30/2018 05:30 PM IST
Wedding bells comedian priyadarshi

‘పెళ్లి చూపులు’ చిత్రంలో కౌశిక్ అనే ఒక్క క్యారెక్టర్ తో ప్రియదర్శి కమెడియన్ గా ఎంతలా క్లిక్ అయ్యాడో చెప్పనక్కర్లేదు. గతేడాది 14 సినిమాల్లో నటించాడంటే అతిశయోక్తి కాదు. అందులో స్పైడర్(తమిళ్), ఘాజీ లాంటి వేరే భాష చిత్రాలు కూడా ఉన్నాయి. అంతెందుకు ఈ ఏడాది కూడా దాదాపు అంతే బిజీగా సినిమాలు చేస్తున్నాడు. అయితే మేకర్లు ను కాస్త గ్యాప్ ఇవ్వమని ఇతగాడు రిక్వెస్ట్ చేశాడంట. అందుకు కారణం.., పెళ్లికి సిద్ధమైపోతున్నాడంట.

రిచాశర్మ అనే యువతితో ప్రియదర్శి పెళ్లికి సిద్ధమైనట్లు ఓ వార్త అందుతోంది. వచ్చే నెల 23న ఓ ప్రముఖ వెడ్డింగ్ హాల్ లో వీరిద్దరూ జంటగా మారబోతున్నారంట. అయితే దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ అవుతోంది.

అసలైతే గత కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. కానీ బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదట. ప్రస్తుతం అ!, తొలిప్రేమ, రవితేజ చిత్రాలతోపాటు తమిళ్ పెళ్లి చూపుల్లో కూడా ప్రియదర్శి కనిపించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles