Bharateeyudu 2 Actress Confirmed | నయన్ కు మరో బిగ్ ఛాన్స్.. ఫస్ట్ టైం ఆయనతో...

Big chance to nayanatara

Nayanatara, Director Shankar, Bharateeyudu 2, Kamal Haasan, Kamal Haasan Nayanatara, Bharateeyudu 2 Nayanatara, Nayanatara Big Chance

Nayanatara Confirms for Bharateeyudu 2. But, Yet to wait official statement. Kamal Haasan starrer directed by Shankar under Lyca Banner.The Makers Plans to release the movie in 2020.

భారతీయుడు-2 లో నయనతార?

Posted: 01/30/2018 04:50 PM IST
Big chance to nayanatara

సౌత్ లో నయనతారకు ఇప్పుడు మాములు క్రేజ్ లేదు. కథలో కంటెంట్.. దానికి తోడు నయన్ ఉంటే సినిమా ఖచ్ఛితంగా హిట్ అవుతుందని మేకర్లలో ఓ నమ్మకం ఏర్పడింది. పైగా చిన్న హీరోలతో కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో రెమ్యునరేషన్ కాస్త ఎక్కువైనా సరే ఆమెతో సినిమాలకు సిద్ధమైపోతున్నారు. అలాగని అన్ని ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు.

అయితే ప్రస్తుతం ఆమెకు ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే భారతీయుడు-2 ప్రాజెక్టుకు నయన్ ను లాక్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. కోలీవుడ్ లో దాదాపుగా అందరు హీరోలతో చేసిన నయనతార కమల్ తో మాత్రమే నటించలేదు. దీంతో ఆమె ఒప్పుకోవచ్చనే చెబుతున్నారు.

లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. 'భారతీయుడు' సంచలన విజయం సాధించింది కనుక, సహజంగానే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. అన్ని కుదిరితే 2020 సమ్మర్ లో భారతీయుడు-2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిగాక చిరు సైరాలో నయన్ నటించబోతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles