Amala Paul Released on Conditional Bail | అరెస్టయి.. అంతలోనే రిలీజ్ అయిన అమల

Amala paul got bail

Actress Amala Paul, Conditional Bail, Amala Paul Arrest, Amala Paul Bail, Amala Paul Arrest, Amala Paul Thiruvananthapuram, Amala Paul Conditional Bail

Actress Amala Paul arrested in tax evasion case, released on conditional bail. It was alleged that she submitted forged documents for the vehicle she bought and was booked for the same. However Court granted Conditional Bail to Amala.

అమలా పాల్ అరెస్ట్.. ఆపై బెయిల్

Posted: 01/30/2018 06:34 PM IST
Amala paul got bail

కెరీర్ సవ్యంగా సాగిపోతున్న టైంలో డైరెక్టర్ విజయ్ ను వివాహం చేసుకుని.. ఆపై విడాకులతో నటి అమలా పాల్ వార్తల్లో నిలిచింది. తర్వాత ఆమె కెరీర్ సక్రమంగా సాగకపోగా.. కొత్త కారు కొనుగోలు... పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన కేసు మెడకు చుట్టుకుంది. దీంతో ఆమె అరెస్ట్ కావాల్సిన పరిస్థితి ఎదురైంది.

అయితే, వెంటనే బెయిల్ లభించడంతో ఆమె విడుదలైంది. కోటి రూపాయల విలువ కలిగిన ఖరీదైన కారును గత ఏడాది కొనుగోలు చేసి ఆమె చిక్కుల్లో పడింది. దాదాపు రూ. 20 లక్షల పన్ను ఎగ్గొట్టేందుకు తప్పుడు చిరుమానా పత్రాలు చూపించి, పుదుచ్చేరిలో కారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, కేరళలో ఆమెపై కేసు నమోదైంది.

దీంతో, ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టులో ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే, ముందు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట లొంగిపోవాలని అమలకు హైకోర్టు సూచించింది. ఈ సూచన మేరకే ఆమె సోమవారం సాయంత్రం లొంగిపోయినట్లు సమాచారం. వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా.. లాయర్ విజ్నప్తి మేరకు షరతులతో కూడిన బెయిల్ ఆమెకు మంజూరు చేసింది. సీనియర్ నటుడు సురేష్ గోపి, మరో నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఇలాంటి కేసుల్లోనే లొంగిపోయి.. వెంటనే బెయిల్ పై విడుదల అయ్యారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Amala Paul  Bail  నటి అమలా పాల్  బెయిల్  

Other Articles