దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న అభిషేక్ బచ్చన్ తిరిగి మేకప్ వేసుకోబోతున్నాడు. మన్మర్జియా చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో తాప్సీ, విక్కీ కుషాల్ ముఖ్య తారలుగా నటించనున్నారు. ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ బచ్చన్ ఫ్యామిలీ విషయాలను వెల్లడించాడు.
ఈ రెండేళ్లు కుటుంబంతో గడపటం చాలా సంతోషానిచ్చింది. ముఖ్యంగా తన కుమార్తె ఆరాధ్యతో. ఇంట్లో ఉన్నంతసేపు తన కూతురు ఆటలాడుతూనే ఉంటుంది అని అభిషేక్ వెల్లడించాడు. ప్రధానంగా ఆటలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని.. తన కుమార్తెకు అన్ని ఆటలు ఇష్టమేనని చెప్పాడు. సినిమా ఫీల్డ్ కాకుండా.. ఆమె క్రీడను ఎంచుకున్నా తనకు ఇష్టమేనని అభిషేక్ తెలిపాడు. పిల్లల మనసుకు ఏది నచ్చితే అది చెయ్యనివ్వాలని పేరెంట్స్ కు సూచించాడు.
ఇక ఐష్ ను సూపర్ మామ్ గా అభివర్ణంచిన అభిషేక్.. వారి దాంపత్య జీవితం గురించి వచ్చిన వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మా వ్యక్తిగత జీవితాలపై ఎలా పడితే అలా వార్తలు రాసేశారు. అయినా మేం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పాప పుట్టాక ఐష్ లావుగా మారటంపై కొన్ని కథనాలు వెలువడ్డాయి. అలాంటి కథనాలు ఎలా రాస్తారో అర్థంకాదు. ఐష్ తన లైఫ్ లో జిమ్ ముఖం చూడలేదంటే మీరు నమ్ముతారా? కానీ, అదే నిజం. ధూమ్-2 షూటింగ్ టైంలో బలవంతపెడితే ఒక్కసారి తాను జిమ్ కు వచ్చిందే తప్ప.. ఆమె ఏనాడూ జిమ్ ముఖం ఎరుగదు అంటూ తమ మధ్య మనస్పర్థల అంటూ వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more