Power Star Shares Pic With Vijay Devarakonda | ’సూపర్ టాలెండెట్ విజయ్ దేవరకొండ‘

Kannada power star vijay devarakonda

Puneeth Rajukumar, Vijay Devarakonda, Sandalwood, Puneeth Vijay Devarakonda, Power Star Super Talent Star

Kannada Power Star Puneeth Rajukumar shared a Pic with Vijay Devarakonda shared. Puneeth Praised Vijay as Super talented.

పవర్ స్టార్ తో విజయ్ దేవరకొండ ఫోటో

Posted: 01/24/2018 06:30 PM IST
Kannada power star vijay devarakonda

విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి ఇచ్చిన పాపులారిటీ మాములుగా లేదు. దెబ్బకు జాతీయస్థాయిలో ఈ కుర్ర హీరో పేరు మారు మోగ్రిపోయింది. ఈ దెబ్బతో పర భాష నిర్మాతలు కూడా విజయ్ తో సినిమాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో కన్నడలో టాప్ నిర్మాత అయిన రాక్ లైన్ వెంకటేశ్ ఓ చిత్రం తీయబోతున్నాడు.

ఈ సినిమా కోసం చర్చల్లో భాగంగా ఈ మధ్య విజయ్ బెంగళూర్ వెళ్లాడు. ఈ సందర్భంగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ తో విజయ్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ముందుగా వెంకటేష్ తో చర్చలు ముగిసిన అనంతరం విజయ్ నేరుగా పునీత్ ఇంటికి వెళ్లాడంట.

ఆ తరువాత ఇద్దరూ కూడా పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారంట. 'సూపర్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండను కలుసుకున్నాను' అని పునీత్ రాజ్ కుమార్ తన ఫేస్ బుక్ లో స్వయంగా ఫోటోను పోస్ట్ చేశాడు. ఇక విజయ్ కూడా 'పునీత్ అన్నను కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా వుంది' అంటూ బదులిచ్చాడు. సినిమాల విషయానికొస్తే.. పునీత్ ఈ ఏడాది వరుసగా మూడు చిత్రాలతో పలకరించబోతున్నాడు. విజయ్ దేవరకొండ .. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles